Akkineni Akhil : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వైపు చూడని హీరోలెవరైనా ఉన్నారంటే అది అక్కినేని హీరోలు మాత్రమే. వారికి కావాల్సింది పక్కా కమర్షియల్ హిట్ సినిమాలు. అన్నపూర్ణ సంస్థ నిర్మించే చిత్రాలు మంచి కమర్షియల్ హిట్ అయి లాభాలొస్తే చాలు..అనేట్టుగా ఉన్నారు. ఒకరకంగా ఇది నిజమే అనుకోవచ్చు. పాన్ ఇండియన్ సినిమాలంటూ ఈ మధ్య కాలంలో వచ్చినవేవీ ఆశించిన సక్సెస్‌లను అందుకోలేదని చెప్పొచ్చు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సహా ఏ భారీ భడ్జెట్ సినిమాకు వచ్చిన లాభాలు, వసూళ్ళు కరెక్ట్ కాదనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ కొన్ని చోట్ల బ్రేకీవెన్ కూడా రీచ్ కాలేదు. కానీ, అన్ని వందల కోట్లు ఇన్ని వందల కోట్లు అని మాత్రం మేకర్స్, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్స్ వేసి ఊదరగొట్టారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఒక్కటే మంచి లాభాలను పొందిందని టాక్. ఎందుకంటే ఈ సినిమాను నిర్మాతలు దాదాపు అనుకున్నంత బడ్జెట్‌లోనే నిర్మించడం వల్లనే అది సాధ్యమైంది. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల కేజీఎఫ్ 2 అనుకున్నదానికంటే కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. పాన్ ఇండియన్ సినిమా కాకపోయినా ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు ఫ్లాప్స్‌గా మిగిలాయి. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ అన్నారే గానీ, చివరికీ 20 కోట్ల వరకూ లాస్ అనేది టాక్.
ఇక ఎఫ్ సినిమా పరిస్థితీ అంతే. అందుకే, అక్కినేని హీరోలు చాలా సేఫ్‌గా సినిమాలు చేస్తున్నారు. మూడు ఫ్లాపుల తర్వాత అఖిల్ ఓ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడమే అఖిల్ ముందున్న టార్గెట్ తప్ప అర్జెంటుగా పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలనేది కాదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమా ప్రస్తుతం మనాలిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో అఖిల్ మరో హిట్ అందుకుంటాడా..? అనే ఇప్పుడు అంతటా టాక్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సూరి సినిమాలు భారీ హిట్ సాధిస్తాయి. లేదంటే ఫ్లాప్ గ్యారెంటీ. అందుకే, అఖిల్ ఖాతాలో రెండవ హిట్ పడుతుందా..! అనే ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఏమవుతుందో ఏజెంట్ రిలీజైతే గానీ తెలియదు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.