Poonam Kaur : త్వరలో అతని గురించి అన్ని విషయాలు బయటపెడుతా… పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..!
Poonam Kaur : సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి జనసేనాని పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే పవన్ కల్యాణ్ అభిమానులు తనను ఇబ్బందులు పెడుతున్నారని, అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారని పోసాని ఆరోపించారు.ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ ఇండస్ట్రీపైన ఆశలు పెట్టుకుని వచ్చిన పంజాబీ అమ్మాయిని ఒకరు మోసం చేశారని, దమ్ముంటే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పవన్ కల్యాణ్‌ను పోసాని డిమాండ్ చేశారు. ఈ […]

Poonam Kaur : సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి జనసేనాని పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే పవన్ కల్యాణ్ అభిమానులు తనను ఇబ్బందులు పెడుతున్నారని, అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారని పోసాని ఆరోపించారు.ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ ఇండస్ట్రీపైన ఆశలు పెట్టుకుని వచ్చిన పంజాబీ అమ్మాయిని ఒకరు మోసం చేశారని, దమ్ముంటే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పవన్ కల్యాణ్‌ను పోసాని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఆ పంజాబీ అమ్మాయి ఎవరు? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగ పలువురి పేర్లు చెప్తున్నారు. అందులో శ్రియా సరణ్, పూనమ్ కౌర్ పేర్లు ఉన్నాయి.
Poonam Kaur : నా సంపూర్ణ మద్దతు ప్రకాశ్ రాజ్‌కే..
ఈ సంగతులు అలా ఉంచితే.. మా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలుపుతూ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తన సంపూర్ణ మద్దతు ప్రకాశ్‌రాజ్ కేనని, మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని, ఆయన గెలిస్తే తాను ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు చెప్తానని, మొత్తం విషయాలు బయటపెడతానని పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయబోరని తెలిపింది. పెద్దలను గౌరవించే వ్యక్తిత్వం కలిగిన మనిషి ప్రకాశ్ అని చెప్పింది. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ ఎటువంటి విషయాలను బయటపెడుతోందనని చర్చ జరుగుతున్నది.
పంజాబీ భామ పూనమ్ కౌర్ కావచ్చునేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటో తెలపాలని విష్ణు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. తాను ఇండస్ట్రీ తరఫున ఉన్నానని, ఇండస్ట్రీలో భాగం అయిన పవన్ ఆ తర్వాత కాలంలో రాజకీయ నాయకుడు అయ్యాడని చెప్పాడు. పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత మీ సినిమా బడ్జెట్ ఉండదని వ్యంగంగా విమర్శించారు. ఇకపోతే అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఆ తర్వాత అధ్యక్షులు ఎవరవుతారు అనేది తేలనుంది.