Chiranjeevi VS Posani : ‘చెప్పు తెగుతుంది’.. చిరంజీవిపై ఫైర్ అయిన పోసాని కృష్ణమురళి
Chiranjeevi VS Posani : తెలుగు పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు పోసాని కృష్ణమురళి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన ఆయన ప్రధాన పాత్ర ఉన్న సినిమాలు కూడా చేశారు. సీరియస్ పాత్రలు కామెడీ పాత్రలు, అన్నింటిని అలవోకగా చేసే పోసాని ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని ఇండస్ట్రీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కొన్ని కారణాల వలన టికెట్ రేట్లను పెంచేవారు కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలోకి అమాంతంగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు.
టికెట్ రేట్లు పెంచొద్దని జగన్ చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు ఇంకా చాలామంది హీరోలతో అన్నాను. అలా అన్నానో లేదో వాళ్ళని అడగండి. నేను అలా అనకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అని పోసాని ఘాటుగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ స్టార్ హీరోలు సినిమా రేట్లు పెంచకుండా 10 కోట్లు తగ్గించుకొని సినిమా చేసుకోవచ్చుగా అని అన్నారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో కూడా అన్నాను. ఆయన ఇది పెద్ద సమస్య కాదు మనం మనం చూసుకోవాలి అంటూ పక్కకి తప్పుకున్నారు. ఇలా టికెట్ రేట్లు పెంచడం వలన జూనియర్ ఆర్టిస్టులు నష్టపోయారు. స్టార్ హీరోలంతా బాగానే సెటిల్ అయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ కరెంట్ రేట్లను పెంచారంటే దానికి ఒక అర్థం ఉంది.. ఒకవేళ పెంచిన అవి అమ్మ ఒడి పథకానికి, పేదవాళ్లకు, చదువుకు, తిండికి వెళతాయి. మరీ సినిమా టికెట్ రేట్లు పెంచితే అది డైరెక్టర్లు, హీరోల జేబులోకి వెళ్తాయి. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు. పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చిన్న సినిమాలు నష్టపోతాయి. పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చిన్న సినిమాలు కూడా అప్పుడే రిలీజ్ చేయాలి. అంతేకానీ స్టార్ హీరోల సినిమాలకి రేట్లు పెంచి చిన్న సినిమాలకు అన్యాయం చేయవద్దని పోసాని ఫైర్ అయ్యారు.