Jabardasth Emmanuel : నీకు ఉందా? లేదా?.. ఇమాన్యుయేల్ పరువుతీసిన పోసాని కృష్ణమురళీ
Jabardasth Emmanuel : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఎంతలా వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే. కలర్ ఫోటో సినిమా టైపులో ఈ ఇద్దరి ట్రాక్ జనాలకు బాగానే కనెక్ట్ అయింది. ఒకానొక సమయంలో ఈ ఇద్దరూ నిజమైన ప్రేమికులేనని అందరూ భ్రమపడిపోయారు. కానీ ఈ ఇద్దరూ మధ్యలో చేసిన అతికి అంతా వ్యర్థమైంది.
అయితే తాజాగా పోసాని కృష్ణమురళీ ఈ ఇద్దరి మీద సెటైర్లు వేశాడు. శ్రీముఖి హోస్ట్ చేస్తోన్న కొత్త షో జాతి రత్నాలు. స్టాండప్ కమెడియన్లతో రాబోతోన్న ఈ కొత్త షో ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కాబోతోంది. చూస్తుంటే ఈటీవీ ప్లస్‌లో పటాస్ షోకు ఇది కొనసాగింపుగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ షోలో పోసాని సందడి చేశాడు.

Posani Krishna Murai On Jabardasth Emmanuel In Jati Ratnalu Show
Jabardasth Emmanuel : రెచ్చిపోయిన పోసాని
భార్యాభర్తలు ఇంట్లో వర్ష ఇమాన్యుయేల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లిద్దరి మధ్య ఏదైనా ఉందా? లేదా? ఉందా? లేదా? అని అనుకుంటూ వాళ్లిద్దరి మధ్య ఏం లేకుండాపోతోంది అని పోసాని స్టాండప్ కమెడియన్‌గా మారాడు. అయితే అసలు నీకు ఉందా? లేదా? అంటూ డబుల్ మీనింగ్‌లో అందరి ముందే ఇమాన్యుయేల్ పరువుతీసేశాడు పోసాని.
