Jabardasth Emmanuel : చనిపోయిన వెళ్లలేకపోయా.. జబర్ధస్త్ స్టేజ్ పక్కకి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చానన్న ఇమ్మాన్యుయేల్
Jabardasth Emmanuel : ఇండస్ట్రీకి చెందిన సెలబ్స్ బయటకు చాలా సంతోషంగా కనిపిస్తున్నా వారి మనసులో మాత్రం చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితులలో మాత్రం వాటిని బయటపెడుతూ అందరు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంటారు. తాజాగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తన తాత చనిపోయినా కూడా వెళ్లలేని పరిస్థితి అని, ఆయనను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అని ఎమోషనల్ అయ్యాడు.ఇమ్మాన్యుయేల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్ దేవరకొండా హీరోగా నటించిన గంగం గణేశా చిత్రం మే 31న రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో ఇమ్మానుయేల్ హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. తనది ఫుల్ లెన్త్ రోల్ కావడంతో ఇమ్మాన్యుయేల్ గంగం గణేశా పై ఆశలు పెట్టుకున్నాడు.
Jabardasth Emmanuel : బాధని భరిస్తూ స్కిట్ చేశా..
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో కలసి ఇమ్మాన్యుయేల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఎదురైనా విషాదకర సంఘటన గురించి వివరించాడు. జబర్దస్త్ లోకి వచ్చిన కొత్తల్లో నాకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తోంది. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేసి తాతయ్య మరణించారు అని చెప్పాడు. నాకు మా తాత అంటే చాలా ఇష్టం. కాకపోతే అప్పుడు నేను వెళితే జబర్ధస్త్ మొత్తం డిస్ట్రబ్ అవుతుంది. అందుకని పక్కకి వెళ్లి మా తాతని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ తర్వాత మళ్లీ కళ్ళు తుడుచుకుని స్టేజిపైకి వచ్చి స్కిట్ పెర్ఫామ్ చేశా.

#image_title
అయితే ఆ స్కిట్ అద్భుతంగా వచ్చింది. నేను చేసిన బెస్ట్ స్కిట్స్ లో అది కూడా ఒకటిగా ఉంటుంది. మా తాత మరణించాడనే బాధ మరిచిపోవడానికి బహుశా బాగా పెర్ఫామ్ చేశానేమో అనిపిస్తుంది.. స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళితే అప్పటికే అంత్యక్రియలు ముగిసాయి. మా తాత కడసారి చూపు కూడా దక్కలేదు అని ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అయ్యాడు. కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు తప్పవంటూ ఆయన చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.