Adipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 16వ తారీకున ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఘనంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రభాస్ త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నాడు. జూన్ 6వ తారీకు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన జైశ్రీరామ్ అనే పాట సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా ఈ పాట బాగా వినిపిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ పై ప్రశంసల వర్షం కురిసింది. టీజర్ అప్పుడు గ్రాఫిక్స్ విషయంలో ఏ రేంజ్ విమర్శలు వచ్చాయో, ట్రైలర్ కి ఆ రేంజ్ లో ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ సిద్ధం అయిపోయిందట. రీసెంట్గా ప్రసాద్ ల్యాబ్ లో దర్శకనిర్మాత దిల్ రాజ్ తో కలిసి ఫైనల్ ఔట్ పుట్ చూశారు. వాళ్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అనుకున్న దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని రామాయణం పై ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో రామాయణం గ్రాండ్ స్కేల్ లో సరికొత్త టెక్నాలజీతో చూపించారని కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతి కలిగిస్తుందని దిల్ రాజ్ చెప్పాడట.
ఇక ఈ సినిమా త్రీడీ వర్షన్ కూడా అన్ని భాషలలో విడుదల కాబోతుంది. త్రీడీ వర్షన్ చూస్తే ఆడియన్స్ కి మన రామాయణం ప్రపంచంలోకి అడుగుపెట్టడం అనే అనుభూతి కలుగుతుందట. వెండితెర మీద శ్రీరాముని వైభోగం ఎలా అయితే చూడాలని రామ భక్తులు కోరుతున్నారో అంతకుమించి ఉంటుందట ఈ సినిమా. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా కేవలం బాలీవుడ్ నుండి 1000 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరీ ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.