Adipurush Movie : ఇంటర్నెట్ లో ఆదిపురుష్ మొట్టమొదటి రివ్యూ ఇదే .. పొరపాటున కూడా మిస్ అవ్వకండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush Movie : ఇంటర్నెట్ లో ఆదిపురుష్ మొట్టమొదటి రివ్యూ ఇదే .. పొరపాటున కూడా మిస్ అవ్వకండి !

Adipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 16వ తారీకున ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఘనంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రభాస్ త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నాడు. జూన్ 6వ తారీకు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన జైశ్రీరామ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 May 2023,12:00 pm

Adipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 16వ తారీకున ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఘనంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రభాస్ త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నాడు. జూన్ 6వ తారీకు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన జైశ్రీరామ్ అనే పాట సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా ఈ పాట బాగా వినిపిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

prabhas Adipurush Movie review

prabhas Adipurush Movie review

ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ పై ప్రశంసల వర్షం కురిసింది. టీజర్ అప్పుడు గ్రాఫిక్స్ విషయంలో ఏ రేంజ్ విమర్శలు వచ్చాయో, ట్రైలర్ కి ఆ రేంజ్ లో ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ సిద్ధం అయిపోయిందట. రీసెంట్గా ప్రసాద్ ల్యాబ్ లో దర్శకనిర్మాత దిల్ రాజ్ తో కలిసి ఫైనల్ ఔట్ పుట్ చూశారు. వాళ్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అనుకున్న దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని రామాయణం పై ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో రామాయణం గ్రాండ్ స్కేల్ లో సరికొత్త టెక్నాలజీతో చూపించారని కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతి కలిగిస్తుందని దిల్ రాజ్ చెప్పాడట.

Adipurush: Prabhas' Film Receives a Musical Motion Poster —  Transcontinental Times

ఇక ఈ సినిమా త్రీడీ వర్షన్ కూడా అన్ని భాషలలో విడుదల కాబోతుంది. త్రీడీ వర్షన్ చూస్తే ఆడియన్స్ కి మన రామాయణం ప్రపంచంలోకి అడుగుపెట్టడం అనే అనుభూతి కలుగుతుందట. వెండితెర మీద శ్రీరాముని వైభోగం ఎలా అయితే చూడాలని రామ భక్తులు కోరుతున్నారో అంతకుమించి ఉంటుందట ఈ సినిమా. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా కేవలం బాలీవుడ్ నుండి 1000 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరీ ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది