TollyWood Heros : కాలర్ ఎగరేసే న్యూస్.. మోస్ట్ పాపులర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్..!!
TollyWood Heros : స్టార్ హీరోలకి ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఎక్కువకాలం ట్రెండ్ లో కొనసాగిన హీరోల పాపులారిటీ ఆధారంగా ఓర్ మార్క్స్ ప్రతినెల మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే జనవరిలో విడుదల చేసిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో విజయ దళపతి నిలిచారు. జనవరిలో ‘ వారీసు ‘ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నారు. ఈ క్రమంలోనే జనవరిలో మోస్ట్ పాపులర్ జాబితాలో విజయ్ దళపతి పేరు మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండడం విశేషం.
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాతో రాకపోయినా జనవరిలో పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ మొదలైంది. దీంతో బన్నీకి మోస్ట్ పాపులర్ జాబితాలో రెండో ప్లేస్ దక్కింది. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నిలిచాడు. పఠాన్ సినిమాతో ఈ జాబితా లోకి షారుక్ యాడ్ అయ్యాడు. ఇక నాలుగవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉండటం విశేషం. ఐదవ స్థానంలో అక్షయ్ కుమార్, ఆరవ స్థానంలో కోలీవుడ్ స్టార్ సూర్య నిలిచారు. అలాగే ఏడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఎనిమిదవ స్థానంలో అక్షయ్ కుమార్, 9వ స్థానంలో రామ్ చరణ్, పదవ స్థానంలో హీరో యష్ నిలిచారు.
అయితే ప్రతి నెలలో మోస్ట్ పాపులర్ హీరో జాబితాలో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లు ఉండటం విశేషం. ఏది ఏమైనా ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ తప్ప మిగిలిన వారంతా సౌత్ ఇండియన్ హీరోలు కావడం విశేషం. ఇక దీంతో టాలీవుడ్ అభిమానులు మోస్ట్ పాపులర్ జాబితాలో టాలీవుడ్ హీరోల పేరు ఉండడం తో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏదేమైనా సౌత్ ఇండియన్ హీరోలు జాతీయస్థాయిలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు.