Prabhas : ప్రభాస్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మల్టీ స్టారరా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలే
Prabhas : ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ హవా బాగా పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అనేక మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ సైతం భావించలేదు.అయితే దర్శకధీరుడు రాజమౌళి వల్ల ఈ అసాధ్యమైన కాంబినేషన్ లో సినిమా సాధ్యమైంది. త్వరలో ప్రభాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. కరణ్ జోహార్ ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ చేశారు. ఇదే ఊపులో ఎన్టీఆర్, ప్రభాస్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఈ కాంబినేషన్ పైనే బాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వరుసపెట్టి కథనాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కరణ్ జోహార్ కు లింక్ చేస్తూ ఈ గాసిప్స్ రావడంతో డిస్కషన్ మరింత పెరిగింది. సౌత్ పై ఎక్కువగా దృష్టిపెట్టిన కరణ్ జోహార్.. ప్రభాస్, ఎన్టీఆర్ ను హీరోలుగా పెట్టి పాన్ ఇండియా లెవెల్లో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి కరణ్ దగ్గర అద్భుతమైన స్టోరీ ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అతడు కొంతమంది సినీ జర్నలిస్టుల దగ్గర ప్రస్తావించాడట. అలా ఈ మేటర్ బయటకొచ్చింది.

Prabhas and Jr NTR Multi Starrer Movie
Prabhas : గాసిప్ నిజం అవుతుందా?
ఈ ఇద్దరు హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా ఉంది.ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో అపజయం ఎరుగని డైరెక్టర్ ఎవరైనా సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైరల్ అవుతున్న వార్తలపై హీరోలు లేదా కరణ్ జోహార్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా,ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ప్రభాస్, ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.