Prabhas : ఎన్టీఆర్ కి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ప్రభాస్ నిర్ణయంతో ప్లాన్ అంతా డిస్ట్రబ్.. బాబోయ్ అనుకుంటున్న ఇద్దరి హీరోల ఫ్యాన్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ఎన్టీఆర్ కి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ప్రభాస్ నిర్ణయంతో ప్లాన్ అంతా డిస్ట్రబ్.. బాబోయ్ అనుకుంటున్న ఇద్దరి హీరోల ఫ్యాన్స్..!

 Authored By ramesh | The Telugu News | Updated on :10 November 2022,1:00 pm

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ తను చేస్తున్న సినిమాల విషయంలో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నా ఆ సినిమాల విషయంలో ఏర్పడుతున్న కన్ ఫ్యూజన్ తో అదే ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. మొన్నటిదాకా వచ్చే సంక్రాంతికి ఆదిపురుష్ వస్తుందని ఆశించగా అది కాస్త జూన్ కి వాయిదా పడ్డది. ఆదిపురుష్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో ఓం రౌత్ మళ్లీ సినిమా కోసం మరో 100 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమాకే ప్రభాస్ టైం కేటాయించాల్సి ఉంటుంది. ఈ టైం లో ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన సలార్ మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక సలార్ పూర్తి చేస్తే ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ సినిమా చేయాలని అనుకున్నాడు. కనీసం సలార్ 2023 ఎండింగ్ కల్లా అయినా అప్పటి నుంచి తారక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా చేయాలని చూశారు. కానీ ప్లాన్ మొత్తం ఛేంజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ మూవీ 2024 లో మొదలయ్యే ఛాన్సులు ఉన్నాయట. సలార్ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 28న రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఆ టైం కి కూడా వస్తుంది అన్న గ్యారెంటీ అయితే లేదు.

prabhas big News to ntr fans upset

prabhas big News to ntr fans upset

సో ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేశాక కానీ ఎన్.టి.ఆర్ సినిమా చేసే అవకాశం లేదు. ఈ గ్యాప్ లో కె.జి.ఎఫ్ 3 అని మొదలు పెడితే మరో రెండేళ్లు గ్యాప్ వచ్చినట్టే. ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇదో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ అని చెప్పొచ్చు. ప్రభాస్, ఎన్.టి.ఆర్ సినిమాల విషయంలో ఈ కన్ ఫ్యూజన్ ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తుంది. ఇక ఓ పక్క ఎన్.టి.ఆర్ కొరటాల శివ తో చేయాల్సిన సినిమా కూడా ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈ సినిమాపై కూడా నందమూరి ఫ్యాన్స్ తీవ్ర సంతృప్తిగా ఉన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది