Prabhas : మెగా ఛాన్స్ మిస్సైనా మళ్ళీ మెగా హీరోనే ప్రభాస్ సెట్ చేశాడా..?

Advertisement

Prabhas : టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ ప్రభాస్ తన దర్శకులకు ఎంతగా రెస్పెక్ట్ ఇస్తారో ఒకసారి తనతో సినిమా చేసిన దర్శకుడిని ఎంతగా అభిమానిస్తారో చాలా తక్కువ మందికే తెలుసు. తనకు ఫ్లాప్ ఇచ్చినా కూడా దర్శకుడిని వదలని హీరో అంటే అది ప్రభాస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే, ఒకసారి మెగా ఛాన్స్ వచ్చేలా చేసిన ప్రభాస్, ఆ ఛాన్స్ మిస్సైనా మళ్ళీ మెగా హీరోతోనే అవకాశం వచ్చేలా చేశారని తాజాగా ఓ దర్శకుడి విషయంలో టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడే సుజీత్. లఘు చిత్రాలను తీసి పాపులర్ అయిన సుజీత్ యూవీ సంస్థ నిర్మాతలను అప్రోచ్ అయి రన్ రాజా రన్ చిత్ర కథ చెప్పి ఒప్పించారు.

అదే కథ ప్రభాస్ కూడా విని బావుందని చెప్పడంతో ఇదే సంస్థలో శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్ సినిమాను తీసి దర్శకుడిగా మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అదే సమయంలో ప్రభాస్‌ను తన మేకింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ప్రభాస్ సుజీత్ డెడికేషన్ చూసి మంచి కథ ఉంటే
సినిమా చేద్దామని మాటిచ్చారు. అలా సాహో సినిమాకు బీజం పడింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్‌తో సాహో సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. మేకింగ్ పరంగా హాలీవుడ్ సినిమాలా తీశాడని ప్రముఖులందరూ ప్రశంసించారు. అయితే, సాహో ఫ్లాప్ కావడంతో
మళ్ళీ ఈ దర్శకుడికి అవకాశాలు రాలేదు.

Advertisement
Prabhas Clarity is also coming Sujeeth movie in Varun Tej
Prabhas Clarity is also coming Sujeeth movie in Varun Tej

Prabhas : ఫ్లాపిచ్చినా కూడా ప్రభాస్ తన దర్శకులను బాగానే లాక్కొస్తున్నారు.

ప్రభాస్, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్. అలా చరణ్‌తో మాట్లాడి సుజీత్‌కు ఇప్పుడు చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా అవకాశం వచ్చేలా చేశారు. కానీ, సుజీత్‌ చేసిన మార్పులు చిరుకు నచ్చక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అయితే, మళ్ళీ ప్రభాస్‌తోనే సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, తాజా
సమాచారం మేరకు ప్రభాస్ ఈ సారి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం సుజీత్‌ను రికమెండ్ చేశారట. ఇప్పటికే, సుజీత్ కథ కూడా వరుణ్‌కు చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరల క్లారిటీ కూడా రాబోతుందని సమాచారం. మొత్తానికి తనకు ఫ్లాపిచ్చినా కూడా ప్రభాస్ తన దర్శకులను బాగానే
లాక్కొస్తున్నారు.

Advertisement
Advertisement