Prabhas : కృష్ణంరాజు అంత్యక్రియలలో ప్రభాస్ చేసిన ఆ పనికి అంతా షాక్..!
Prabhas: దివంగత నటుడు కృష్ణం రాజు మరణం అందరిని కలిచి వేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఆయన స్వర్గస్తులైయ్యారు. సినీ సెలెబ్రిటీస్‌తో పాటు రాజకీయ నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కృష్ణంరాజు మరణవార్తను వినగానే సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలిపారు. కృష్ణంరాజు ఘనతలు, సమాజ సేవ, రాజకీయ కార్యక్రమాలను పంచుకొన్నారు. సినీ ప్రముఖులు ప్రత్యేకంగా సంతాప ప్రకటనలు విడుదల చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు.
అజాతశత్రువైన రెబల్ స్టార్ ఇకలేరే వార్తను జీర్ణించుకోలేకపోయారు. కృష్ణం రాజు పలు సేవా కార్యక్రమాలు చేసి కూడా జనాలకు దగ్గరయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసే తనదైన స్టైల్ లో రాజకీయం చేసిన ఘనత కృష్ణంరాజుకే దక్కింది. అయితే సినిమాలు, రాజకీయాల ద్వారా ఎంతో మంది మనసులు గెలుచుకున్న కృష్ణం రాజు అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు కనక మామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆయన అంతక్రియలకు సినీ ప్రముఖులు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు రెబెల్ ఫ్యామిలీ.

prabhas full emotional in krishnam raju cremation
Prabhas : ప్రభాస్ ఎమోషనల్ కామెంట్స్..
పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కలతచెందాడు. మనోస్థైర్యాన్ని కూడగట్టుకొని తనను పరామర్శించడానికి వచ్చిన ప్రముఖులందరిని తన అక్కున చేర్చుకొన్నారు. తనకు తాను మానసికంగా సిద్దమై.. ఆయనను అభిమానించే వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కనిపించింది. అయితే అంత్యక్రియల సమయంలో ఆయన ప్రవర్తన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కృష్ణం రాజు చితికి నిప్పు పెట్టే టైంలో ప్రభాస్ ని పిలుస్తారు అక్కడ ఉండేవాళ్లు. అయితే ఈ టైంలో ప్రభాస్ వస్తూ చెప్పులు కూడా వేసుకోవడం మర్చిపోతాడు. కన్నీటి పర్యంతం అయిపోతాడు చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు. ఈ దృశ్యాలు చూసిన అందరూ ప్రభాస్ ని ఇలా చూడలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు.
