
Prabhas Kalki movie matter leak
Prabhas Kalki : త్వరలోనే ప్రభాస్ ‘ కల్కి 2898AD ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా గ్లింప్స్ విడుదలయ్యాయి. మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో గ్లింప్స్ చూశాక అభిమానుల్లో మరింతగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి కమల్ హాసన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని సాండ్ డియోగో కామికన్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ నేను ఈ సినిమాలో నటిస్తున్నానంటే ప్రభాస్ కూడా నమ్మలేదు.
ఈ సినిమాను నేను ఎందుకు చేయాలనుకున్నానో మీకు చెప్పాలి. కొన్ని ఏళ్ల నుంచి మేము పురాణాలను ఫాలో అవుతున్నాం. ఆ పురాణాల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం నాగ్ అశ్విన్ ఈ సినిమాను తీస్తున్నారు. నా వంతు సహాయంగా నేను ఈ సినిమాలో ఇష్ట ప్రకారంగా భాగమయ్యాను. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. అందుకే నేను విలన్ గా చేయడానికి ఓకే చెప్పాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో యూనివర్సల్ స్టార్ నటిస్తున్నారు అంటే ఆ సినిమా డెప్త్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని అభిమానులు అంటున్నారు.
Prabhas Kalki movie matter leak
దీంతో సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ కే సినిమా గురించి మరోసారి ఆ హాట్ టాపిక్ గా ట్రెండు అవుతుంది. విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అంటే అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఇప్పుడు వచ్చే సినిమాలతోనైనా ప్రభాస్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.