Home » Entertainment » Prabhas Kalki Teaser Review
Entertainment

Prabhas Kalki : కల్కి టీజర్ రివ్యూ – దీ తెలుగు న్యూస్ స్పెషల్ !

Authored By
aruna
The Telugu News | Updated on: July 21, 2023 3:57 pm
Advertisement

Prabhas Kalki  : త్వరలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. విడుదలకి ఇంకా సమయం ఉన్న ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. నిమిషానికి పైగా ఉన్న ఈ టీజర్ భారీ అంచనాలు అందుకుంది. ప్రభాస్ తో పాటు రెండు కీలక పాత్రలను చూపించారు. విజువల్స్ హాలీవుడ్ సినిమాలకు తగ్గకుండా ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ టీజర్ మరింతగా ఆకట్టుకుంది. ఇక ప్రభాస్ లుక్స్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ప్రాజెక్ట్ కె అంటే కల్కిఅని రివిల్ చేశారు.

Advertisement

కాబట్టి ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా పేరు కల్కి. కథలో ప్రాజెక్ట్ కె అనే అంశం ఉండడం విశేషం. టీజర్ లో కథపై హింట్ ఇచ్చేశారు. కథ 2898 AD లో మొదలవుతుంది అంటే నేటి కాలానికి ఐదు వేలసంవత్సరాలకు పూర్వం. దుష్టుల వలన మానవజాతి హింసకు గురవుతున్నప్పుడు ప్రజల్లో ఆశలు కలిగించడానికి కల్కి రంగంలోకి దిగుతాడు. దుష్ట సంహరణ చేస్తాడు అదే మెయిన్ కథ. దీని భవిష్యత్తు, భూతకాలల మధ్య నడిపినట్లు తెలుస్తోంది. పిరియాడిక్ స్టోరీ తో పాటు భవిష్యత్తుకి సంబంధించిన నేపథ్యం కూడా ఉండనుంది. అంటే మోడ్రన్ వరల్డ్ ఎలా ఉంటుందో చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభాస్ శత్రువులతో యుద్ధం చేస్తాడు. కల్కి అనే పేరుతోనే మనకు ఒక అవగాహన వస్తుంది.

Prabhas Kalki teaser review

Advertisement

మన పురాణాల ప్రకారం కలియుగంలో పాపం పెరిగిపోయినప్పుడు కల్కి అవతరించి దుష్ట సంహారం చేస్తాడు. దాని ఆధారంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కల్కిలా ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఈ టీజర్ లో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే కనిపించారు. ఆమె చాలా మోడరన్ గా ఉంది. అలాగే తమిళ నటుడు పశుపతి కీలక పాత్ర చేశారని పిస్తుంది. ఇక ఈ టీజర్ అర్ధరాత్రి విడుదలైంది అయినా కూడా ప్రభాస్ అభిమానులు మేల్కొని మరి ఈ టీజర్ ని చూశారు. మొత్తంగా కల్కి టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా కల్కి టీజర్ తో డైరెక్టర్ నాగ అశ్విన్ కొంతమేరకు మెప్పించాడు. ఇక ఈ సినిమాను అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి