Prabhas : ప్ర‌భాస్ పెళ్లి చేసుకోక‌పోతే ఆయ‌న వేల కోట్ల ఆస్తులు ఎవ‌రికి చెందుతాయంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్ర‌భాస్ పెళ్లి చేసుకోక‌పోతే ఆయ‌న వేల కోట్ల ఆస్తులు ఎవ‌రికి చెందుతాయంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : ప్ర‌భాస్ పెళ్లి చేసుకోక‌పోతే ఆయ‌న వేల కోట్ల ఆస్తులు ఎవ‌రికి చెందుతాయంటే..!

Prabhas  : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్ర‌భాస్. ఆయ‌న‌కి ఇప్పుడు ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాహుబ‌లి సినిమా ప్ర‌భాస్ క్రేజ్‌ని ప‌దింతలు పెంచ‌గా, ఇప్పుడు ఆయ‌న ఒక్కో సినిమాకి వంద నుండి 150 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడు. ప్ర‌భాస్ న‌టించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. వరుసగా ఫ్లాపయ్యాయి. అయినా కలెక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా రాబట్టాయి. ఇక ఈ మ‌ధ్య వ‌చ్చిన స‌లార్ చిత్రం ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత పెరిగేలా చేసింది. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి, రాజాసాబ్ చిత్రాలు చేస్తున్నారు. వీటితర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్2 చేయాల్సి ఉంది.

Prabhas  అంత ఆస్తి ఎవ‌రికి?

ప్ర‌భాస్ కెరియ‌ర్‌కి ఎలాంటి ఢోకా లేదు. కాక‌పోతే ఆయన పెళ్లి గురించే అంద‌రిలో ఆందోళ‌న‌. ప్ర‌భాస్‌కి 44 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చిన కూడా ఇంకా సింగిల్‌గా ఉండ‌డంతో ఆయ‌న పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కొంద‌రు అయితే ఏఐలో ప్రభాస్ కు, అనుష్కకు పెళ్లి చేసి.. పిల్లలను కూడా పుట్టించేశారు. అది నిజంకాకపోయినా ఆ ఫోటోలలో ప్రభాస్ – అనుష్క జంట ఎంత అందంగా ఉన్నారో మాటల్లో చెప్పడం కష్టం. బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా తరువాత ఈ జంట మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో నటించారు. అప్పటినుంచి వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Prabhas ప్ర‌భాస్ పెళ్లి చేసుకోక‌పోతే ఆయ‌న వేల కోట్ల ఆస్తులు ఎవ‌రికి చెందుతాయంటే

Prabhas : ప్ర‌భాస్ పెళ్లి చేసుకోక‌పోతే ఆయ‌న వేల కోట్ల ఆస్తులు ఎవ‌రికి చెందుతాయంటే..!

పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటున్న ప్ర‌భాస్ కోట్లు సంపాదించాడు. 100 నుంచి రూ.150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. వీలునుబట్టి లాభాల్లో వాటా తీసుకుంటాడు. ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ఖరీదైన ఫాంహౌస్‌లు, లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, విదేశాల్లో ఇళ్లు ఉన్నాయి. ఆస్తులు భారీగా ఉన్నాయి. ప్ర‌భాస్ పెళ్లి చేసుకోక‌పోతే ఈ ఆస్తులు అన్ని ఎవ‌రికి చెందుతాయి అన్న ప్ర‌శ్న అంద‌రిలో ఉంది. . డార్లింగ్ కు ప్రభోద్ అనే సోదరుడు, ప్రగతి అనే సోదరి ఉన్నారు. వీరిద్దరు కాకుండా పెదనాన్న కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డార్లింగ్ తర్వాత కూడా వివాహం చేసుకోకుండా అలాగే ఉంటే అతని ఆస్తులన్నీ వీరికే చెందుతాయంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది