radhe shyam movie postpone promostions because of rrr Movie
Prabhas : ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ విడుదలైన వారం రోజులకే ఈ సినిమా రీలిజ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లపై ఇది ప్రభావం చూపనుంది. అయితే ఇదే విషయమై.. రాధే శ్యామ్ చిత్ర బృందం ఆ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ వైపు ఆర్ఆర్ఆర్ బృందం అన్ని భాషల్లోనూ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తుంటే… రాధే శ్యామ్ చిత్ర బృందం మాత్రం అంతగా హాడవిడి చేయకపోవడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు.
అయితే సినిమా అనుకున్న సమయానికే వస్తుందని చిత్ర బృందం అంటోంది. కాగా ప్రమోషన్స్ ను కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేయడానికి మరొక కారణం ఉందని తెలుస్తోంది. సినిమా విడుదలకు సరిగ్గా వారం ముందు అనగా.. జనవరి 7వ తారీకు నుండి రాధే శ్యామ్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టబోతోందని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ మాదిరి.. నార్త్ మొదలుకొని సౌత్ వరకు అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడట. ఆర్ ఆర్ ఆర్ కుడా భారీ బడ్జెట్ సినిమా కావడం, రాజమాళితో తనకు మంచి అనుబంధం ఉండటం కారణంగా..
radhe shyam movie postpone promostions because of rrr Movie
ఇప్పపటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే… ఆర్ ఆర్ ఆర్ సినిమా బిజినెస్ కి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత .. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్.. విక్రమాదిత్య అనే రోల్‌లో సందడి చేయబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.