Radhe Shyam Trailer :యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం రాధే శ్యామ్. పూజా హెగ్డే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. పలు కారణాల వలన వాయిదా పడ్డ ఈ సినిమా మార్చి 11 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యటానికి సిద్ధం అవుతున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్, పూజా లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రేమకి, విధికి మధ్య జరిగే యుద్ధమే రాధే శ్యామ్ అనే డైలాగ్‌తో పాటు పలు డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
జోతిష్యం, హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబంధించి చాలా హనెస్ట్‌గా ఓ విషయాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజన్ అంటున్నారు మేకర్స్. రాజులు, యువరాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్టర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ నటించారు. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పేరుతో.. హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. 1970-80ల కాలం నాటి లవ్ స్టోరీగా తెరకెక్కింది. ప్రేమ, విధి మధ్య పోరాటంగా ఈ సినిమా ఉండనుంది. చిత్రంలో మెజీషియన్ విక్రమాదిత్యగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్, పూజా హెగ్డేతో ప్రభాస్ చేసే రొమాంటిక్ ట్రాక్ అందరిని అక్కట్టుకుంటుందట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందట. సెకండాఫ్ లో లెక్కలేనన్ని మలుపులు ఉంటాయట. ఇక ఈ సినిమా ఐరిష్ జ్యోతిష్యుడు చెయిరో స్ఫూర్తితో తెరకెక్కిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.