Prabhas : కృష్ణంరాజు మ‌ర‌ణంతో ప్ర‌భాస్ అంత పెద్ద నిర్ణ‌యం తీసుకున్నాడా.. దండం పెట్టేసిన శ్యామ‌లా దేవి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : కృష్ణంరాజు మ‌ర‌ణంతో ప్ర‌భాస్ అంత పెద్ద నిర్ణ‌యం తీసుకున్నాడా.. దండం పెట్టేసిన శ్యామ‌లా దేవి

 Authored By sandeep | The Telugu News | Updated on :17 September 2022,1:30 pm

Prabhas : ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో అతి పెద్ద విషాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో కొద్దిరోజులుగా గచ్చిబౌలీలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో జరిగాయి. రెబల్ స్టార్ మరణాన్ని సినీ ప్రముఖులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏తో కృష్ణం రాజు కలిసున్న మధురమైన జ్ఞాపకాలను కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. ఇక కృష్ణం రాజు ఫ్యామిలీ విష‌యాల గురించి కూడా కొంద‌రు నోరు విప్పుతున్నారు.

Prabhas : షాకింగ్ నిర్ణ‌యం..

కృష్ణంరాజు మరణం ప్రభాస్ కు తీరని లోటు అనే చెప్పాలి . పెద్ద‌నాన్న‌ని ఎంతో ప్రాణంగా ప్రేమించే ప్ర‌భాస్ ఇప్పుడు ఆయ‌న లేని లోటుని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయన మరణించి దాదాపు ఆరు రోజులు కావస్తున్న ఇంకా ప్రభాస్ ఆ విషాదఛాయల్లోనే మునిగిపోయారు . రీసెంట్ గా ప్రభాస్ తీసుకున్న డెసిషన్ రెబెల్ అభిమానుల్లో కంగారు పెట్టిస్తుంది. త‌న పెద్ద‌నాన్న మృతి కార‌ణంగా ప్ర‌భాస్ దాదాపు మూడు నెలల పాటు అన్ని షూటింగ్స్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడట . ప్రశాంత నీల్ కి ..నాగ్ అశ్విన్ కి.. మారుతికి మూడు నెలలపాటు ఎటువంటి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకొని అంటూ కరాఖండిగా చెప్పేసారట.

Prabhas Stops Shooting 3 Months Because of Krishnam Raju Death

Prabhas Stops Shooting 3 Months Because of Krishnam Raju Death

పెద్ద బడ్జెట్‌తో ప్ర‌భాస్ హీరోగా సినిమాలు చేస్తుండ‌గా, ఇప్పుడు ఆయ‌న మూడు నెల‌ల పాటు సినిమాలు చేయ‌కుండా బ్రేక్ ఇస్తే నిర్మాత‌లకు ఎంత పెద్ద న‌ష్టం వాటితుల్లుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాని కృష్ణంరాజు ఫ్యామిలీకి ఇప్పుడు తానే పెద్ద దిక్కు కావ‌డంతో ఈ మూడు నెల‌ల్లో చెల్లెళ్ల బాగోగుల‌తో పాటు మిగ‌తా కార్య‌క్ర‌మాల‌న్నింటిన సెట్ చేయాల‌ని ప్ర‌భాస్ అనుకున్నాడ‌ట‌.ఈ విష‌యం తెలిసిన శ్యామలాదేవి ప్రభాస్ కి చేతులు జోడించి దండం పెట్టేసిందట. ” నువ్వు నా కడుపున పుట్టకపోయిన.. నువ్వే నా కొడుకు” అంటూ ఎమోషనల్ అయిపోయిందట.ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది