Prabhas : ఏందయ్యా ప్రభాస్ ఈ స్పీడ్.. ఏకంగా ఆ డైరెక్టర్‌తో మూవీ సెట్ చేశావా..!
ప్రధానాంశాలు:
Prabhas : ఏందయ్యా ప్రభాస్ ఈ స్పీడ్.. ఏకంగా ఆ డైరెక్టర్‌తో మూవీ సెట్ చేశావా..!
Prabhas : డార్లింగ్ ప్రభాస్ Prabhas పెళ్లి ఆలోచన పక్కన పెట్టేసి వరస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ . ఆతర్వాత కల్కి సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత సలార్ 2, కల్కి 2 కూడా పట్టాలెక్కనున్నాయి.

Prabhas : ఏందయ్యా ప్రభాస్ ఈ స్పీడ్.. ఏకంగా ఆ డైరెక్టర్‌తో మూవీ సెట్ చేశావా..!
Prabhas క్రేజీ ప్రాజెక్ట్..
సందీప్ రెడ్డి Sandeep Reddyవంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ పనులు కూడా మొదలవ్వనున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాను చేయనున్నాడు. ఇక ఇప్పుఉ హనుమాన్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మని లైన్‌లో పెట్టినట్టు తెలుస్తుంది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ పక్కన పెట్టి, రెబల్ స్టార్ ప్రభాస్ తో మూవీకి ప్రశాంత్ వర్మ సిద్ధమవుతున్నారు.
ప్రశాంత్ వర్మ కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ కు Ranveer Singh ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా స్క్రిప్ట్ ను వివరించిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా పలు కారణాల వల్ల రణవీర్ సింగ్ ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో, ఈ సినిమాని ప్రభాస్ చేయబోతున్నాడట. ఈ సినిమా కోసం ప్రభాస్ టెస్ట్ లుక్ ఈ రోజు (ఫిబ్రవరి 26, బుధవారం) ప్లాన్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు కాబోతోంది? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.