Bigg Boss Telugu 8 : ఆ ముగ్గురిలో ఎవరు ఫైనల్‌కి.. పృథ్వీకి అన్యాయం జరిగిందా ?
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : ఆ ముగ్గురిలో ఎవరు ఫైనల్‌కి.. పృథ్వీకి అన్యాయం జరిగిందా ?
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో గత మూడు రోజులుగా టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతుంది. బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకువచ్చి.. రోజుకో కంటెండర్ ను సెలక్ట్ చేయిస్తున్నాడు బిగ్ బాస్. మొదటి రోజు నిఖిల్, హరికా రాగా, రెండో రోజు మానస్, ప్రియాంక జైన్ వచ్చారు. ఇక తాజా ఎపిసోడ్‌లో పునర్నవి, వితికా షేరు హౌస్ లోకి వచ్చారు మొదటి కంటెండర్ గా రోహిణి, రెండో కంటెండర్ గా అవినాశ్ విజయం సాధించగా.. తాజా ఎపిసోడ్ లో ఫైనల్ కంటెస్టెంట్ గా నిఖిల్ ఎన్నిక అయ్యారు. ఈరేసు చాలా టఫ్ గాను ఇంట్రెస్టింగ్ గా మారింది.టికెట్ టూ ఫినాలే చివరి కంటెండర్ షిప్ కోసం నిఖిల్, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ పోటీపడ్డారు. పోటాపోటీగా సాగిన గేమ్‌లో నిఖిల్ విన్నర్‌గా నిలిచాడు. అతడికి పృథ్వీ చివరి వరకు గట్టిపోటీ ఇచ్చాడు.
Bigg Boss Telugu 8 టఫ్ ఫైట్..
హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌తో ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడించారు పునర్నవి, వితికా…ఈ గేమ్‌లో భాగంగా విష్ణుప్రియ అంటే ఇష్టమా అని పృథ్వీని అడిగింది పునర్నవి. ఫ్రెండ్‌గా ఇష్టమంటూ పృథ్వీ సమాధానమిచ్చాడు. హౌజ్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత విష్ణుప్రియతో ఇదే ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తావా అని అడిగిన ప్రశ్నకు చెప్పలేం అంటూ పృథ్వీ అన్నాడు. విష్ణుప్రియ మాత్రం పృథ్వీ తనకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని సమాధానమిచ్చింది. ఈ గేమ్ లో పృధ్వీ ఫస్ట్ , నిఖిల్ సెకండ్ వచ్చారు. అయితే రూల్ ను ఫాలో అవ్వలేదు అన్న కారణంగా పృధ్వీ పాయింట్స్ తగ్గించి.. నిఖిల్ ను ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టారు వితికా అండ్ పునర్నవి. దాంతో నిఖిల్ ఫస్ట్ రౌండ్ విన్నర్ అయ్యాడు.
ఫస్ట్ రౌండ్ విన్నర్ అయితే..సెకండ్ టాస్క్ కు బెనిఫట్ వస్తుంది కదా.. దాంతో ఆతరువాతి టాస్క్ లో కూడా నిఖిల్ గెలిచి.. కంటెండర్ అయ్యాడు. సో ఫైనల్ గా రోహిణి,అవినాష్, నిఖిల్ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడబోతున్నారు. అయితే ఫస్ట్ రౌండ్ లో గెలిచినట్టుగా పృధ్వీకి విన్ ఇచ్చి ఉంటే.. కంటెండర్ గా పృధ్వీ గెలిచేవాడు. కాని అతనికి అన్యాయం జరిగిందని అంటున్నారు. ఆ తర్వాత టాస్క్‌లో ప్రేరణను బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి రేసు నుంచి తప్పించారు సంచాలక్‌లు. వారి నిర్ణయంపై ప్రేరణ హర్ట్ అయ్యింది. నిఖిల్, పృథ్వీ, గౌతమ్‌లకు బిగ్‌బాస్ ఐ టాస్క్ పెట్టాడు. ఇందులో నిఖిల్ విన్నర్‌గా నిలిచి టికెట్ టూ ఫినాలే కంటెండర్‌షిప్ గెలుచుకున్నాడు.