Priya Prakash Varrier : హుక్కు ఊడిందా, పరువు గోవిందా.. ప్రియ ప్రకాశ్ రచ్చకు సోషల్ మీడియా షేక్
Priya Prakash Varrier : కన్నుగీటుతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ అందుకున్న ఈ భామ మలయాళం, తెలుగు సినిమాలలో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో చెక్, ఇష్క్ సినిమాలతో మెప్పించిన ప్రియా వారియర్ మరిన్ని తెలుగు సినిమాలతో రాబోతుంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ని సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ప్రియా ప్రకాశ్‌కి మంచి హిట్ అనేది రావడం లేదు. దీంతో సోషల్ మీడియాని నమ్ముకుంటుంది.
ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు వైరల్ అవుతుంటాయి.ఆమె కళ్ళల్లో మత్తు, లేదా అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉంటాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ జాకెట్‌కి కేవలం ఒకే ఒక్క హుక్కు పెట్టుకొని అందాల ఆరబోతతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రియా ప్రకాశ్ అందాల రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రియా ప్రకాశ్ ఆ మధ్య ఓ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైందని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపింది. ఫెర్న్ గొరెగాన్ హోటల్‌లో నేను బస చేశాను.

priya prakash varrier stylish looks are stunning
Priya Prakash Varrier : ప్రియా తగ్గేదే లే..
ఈ హోటల్ పాలసీ ఏంటంటే బయట ఫుడ్‌ను లోపలికి అస్సలు అనుమతించరు. అది తెలియక షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోటల్‌కు వచ్చాను. అయితే హోటల్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ ప్రొడక్షన్ కంపెనీ వాళ్లే చేస్తారు. ఆర్టిస్టులకు సంబంధం ఉండదు కాబట్టి వాళ్లకి ఇష్టమొచ్చిన పాలసీలని ఫాలో అవుతున్నారు. నా ఫుడ్ ని అస్సలు లోపలికి పంపించలేదు. నేను ఎంతో మర్యాదగా వారిని వేడుకున్నా. ఈ ఒక్కసారికి వదిలేయండి. కానీ వాళ్లు వినలేదు. ఆ ఫుడ్‌ను బయటే వదిలేయాలంటూ పెద్ద సీన్ చేశారు. కనీసం నేను చెప్పేది కూడా వినిపించుకోలేదు. నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో బయట చలిలో భోజనం చేయాల్సి వచ్చింది” అని పోస్ట్ చేసింది ప్రియా వారియర్.