Priyamani : లవ్ స్టోరీని కళ్లకు కట్టినట్టు చూపించారు.. స్టేజ్ మీద కంటతడి పెట్టిన ప్రియమణి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 2 May 2022, 9:00 pm

Priyamani : ప్రియమణి లవ్ స్టోరీ ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది.పెళ్లైన వాడిని మళ్లీ పెళ్లి చేసుకోవడంతో కాంటవర్సీగా మారింది. ముస్తఫా రాజ్ మొదటి భార్య కూడా కేసు వేసింది. ఇంకా ముస్తాఫకు తన మొదటి భార్యకు మధ్య విడాకులు కూడా మంజూరు అవ్వలేదు. కానీ ప్రియమణితో మాత్రం పెళ్లి జరిగిపోయింది. అలా ప్రియమణి ప్రేమ, పెళ్లి వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి.ఆ మధ్య ప్రియమణి తన భర్తతో విడిపోయిందని, వేరుగా ఉంటుందని పుకార్లు వచ్చాయి.

కానీ ప్రియమణి మాత్రం వాటిని పరోక్షంగా కొట్టిపారేసింది. భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ రూమర్లకు చెక్ పెట్టేసింది. అయితే తాజాగా ప్రియమణి జీవిత గాథను ఢీ స్టేజ్ మీద ప్రదర్శించారు. మహానటి అనే పాటకు స్పెషల్ పర్ఫామెన్స్ చేశారు. ఇందులో ప్రియమణి చిన్నతనం నుంచి ఎలా ఉండేదో చూపించారు.మొదటి సినిమా అవకాశం, జాతీయ అవార్డు రావడం, సీసీఎల్‌లో ముస్తఫాతో తొలి పరిచయం, ప్రపోజల ఇలా అన్నీ కూడా చూపించారు.

Priyamani gets Cried In Dhee 14 latest Promo

Priyamani gets Cried In Dhee 14 latest Promo

పెళ్లైన వాడిని పెళ్లి చేసుకుంటావా? అని సమాజం అన్న సూటి పోటి మాటలను కూడా చూపించారు. ఏం జరిగినా సరే నీ చేతిని వదిలి పెట్టను అని ముస్తఫా రాజ్ అన్నట్టుగా అందులో చూపించారు. అది చూసి ప్రియమణి తెగ ఎమోషనల్ అయ్యారు.ఇక స్టేజ్ మీదకు ప్రియమణిని పిలిచి.. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు.అది చూసి ప్రియమణి స్టేజ్ మీదే కన్నీరుమున్నీరయ్యారు. మరి ఆ గిఫ్ట్ ఏంటో చూడాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో మరి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి