Priyamani Poorna : ఢీ స్టేజ్ మీదే సంసారం చేయించండి.. పూర్ణ, ప్రియమణిలపై నెటిజన్లు ఫైర్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 9 October 2021, 8:00 am

Priyamani Poorna : బుల్లితెరపై షోలు ఎలా తయారయ్యాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పాటల షో అంటే కేవలం పాటలే ఉండేవి. డ్యాన్స్ షో అంటే డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కామెడీ షోలు అంటే కామెడీనే ఉండేది. కానీ ఇప్పుడు ఏది పాటల షో, డ్యాన్సుల షో అనేది తెలియకుండా పోతోంది. మరీ ముఖ్యంగా ఢీ షో అయితే దారుణంగా తయారైంది. డ్యాన్సులు తక్కువ మిగతా పనులు ఎక్కువ. అసలే రాకేష్ మాస్టర్ ఢీ షో గురించి, వాటి వెనకాల కంటెస్టెంట్లు చేసే పనుల గురించి దారుణమైన కామెంట్లు చేశాడు.

Priyamani Poorna On Nainika Sai Love Story In Dhee

Priyamani Poorna On Nainika Sai Love Story In Dhee

అతని కామెంట్లను నిజం చేయడానికే అన్నట్టుగా ప్రియమణి, పూర్ణలు ఇద్దరూ కూడా రెచ్చిపోతోంటాడు. హగ్గులు, కిస్సులతో నానా హంగామా చేస్తారు. ఇక వీరు చేసేది సరిపోదన్నట్టుగా.. కంటెస్టెంట్ల మధ్య ట్రాక్, సుధీర్ రష్మీ, దీపిక ఆది ట్రాకులను కూడా వాడుకుంటారు. తాజాగా వదిలిన డీ ప్రోమోలో ఓ జంట మరింతగా రెచ్చిపోయి హద్దులు దాటేసింది. నైనిక, సాయి కంటెస్టెంట్ల లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. చాటింగ్‌లో రొమాన్స్ ఉంటుంది.. ఇక్కడ రొమాన్స్ లేదు అని సాయి గురించి నైనిక ఆ మధ్య చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

Priyamani Poorna : నైనిక, సాయి లవ్ స్టోరీపై నెటిజన్లు ఫైర్

Priyamani Poorna On Nainika Sai Love Story In Dhee

Priyamani Poorna On Nainika Sai Love Story In Dhee

అయితే తాజాగా మరోసారి ఈ జంట ట్రెండింగ్‌లోకి వచ్చింది. స్టేజ్ మీద నిలబెట్టి వారి ప్రేమను బయటపెట్టించేసింది. నీకు నిజం నైనిక అంటే ఇష్టమా? అని పూర్ణ, ప్రియమణి అడిగారు. అవును అంటూ సాయి చెప్పాడు. మా అత్త కూడా ఇక్కడే ఉందంటూ నైనిక తల్లిని చూపించాడు. మీకు ఇష్టమేనా? అని నైనిక తల్లిని ప్రియమణి, పూర్ణ అడిగారు. ఇష్టమే అని ఆమె కూడా చెప్పింది. ఈ తతంగం అంతా చూసిన ప్రేక్షకులు కింద కామెంట్లతో ఆడుకున్నారు. పెళ్లి కూడా చేసేయండి, శోభనాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయండి, మరీ బ్రోకర్ హౌస్‌లా తయారైందని నెటిజన్లు మండిపడ్డారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp