Priyamani : రిపోర్టర్ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకి పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన ప్రియమణి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Priyamani : రిపోర్టర్ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకి పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన ప్రియమణి ..!

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  priyamani : రిపోర్టర్ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకి పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన ప్రియమణి ..!

priyamani : ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఓటిటి సబ్జెక్టులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.గ్లామరస్ గా కనిపిస్తూనే అద్భుతమైన పాత్రలను పోషిస్తున్నారు.ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ప్రియమణి క్రేజ్ మళ్ళీ పెరిగిపోయింది.నేషనల్ వైడ్ గా ఇప్పుడు క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆహా లో ఆమె చేసిన ‘ భామ కలాపం ‘ సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు రెండవ సీజన్ విడుదలకు రెడీ అయింది. ఆహాలో ఫిబ్రవరి 16 నుంచి ‘ భామ కలాపం 2 ‘ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు అభిమన్యు, నటి శరణ్య, సిరత్ కపూర్, ప్రియమణి పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రియమణి మాట్లాడుతూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. డేంజరస్ వైఫ్ అని పోస్టర్ లో చెబుతున్నారు. రియల్ లైఫ్ లోను అంతేనా అని అడిగితే.. రీల్ లైఫ్ లోనే అలా రియల్ లైఫ్ లో తాను డేంజరస్ వైఫ్ ని కాదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

హౌస్ వైఫ్స్ అన్ని బాధ్యతలను 100% సక్రమంగా నిర్వర్తించగలరని గృహణీలు తలచుకుంటే ఏదైనా చేయగలరని చెప్పుకొచ్చారు. తనకు వంట రాదని, ఇంట్లో తాను వండనని, తన భర్త అద్భుతంగా వంట చేస్తారని, తాను మాత్రం చక్కగా తింటానని ప్రియమణి తెలిపారు. ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు లాగే భార్య భర్తల మధ్య ఉండే సరదా తగువులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక భర్తకు భయపడతారా భర్తను భయపెడతారా అని అడిగితే ప్రియమైన నవ్వుతూ కొన్ని సందర్భాల్లో భయపడతాను, ఇంకొన్ని సందర్భాల్లో భయపెడతానని ఫన్నీగా చెప్పేశారు. పెళ్లి అయ్యాక ఇంత మంచి గుర్తింపు అవకాశాలు వస్తుండడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం నాకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అన్ని భాషల ఇండస్ట్రీకి చెందినవారు ఆఫర్లు ఇస్తున్నారు.

అన్ని చోట్ల పని చేయగలుగుతున్నాను. ఇంటిని, సినిమాలను మేనేజ్ చేసుకుంటున్నాను. నా భర్త అందుకు ఎంతో సహకరిస్తుంటారు అని తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. భామ కలాపం 2 బావుంటుందని ఫస్ట్ సీజన్ కంటే రెండో సీజన్ మరింత డబుల్ ఫన్, డబుల్ త్రిల్ ఉంటుందని ప్రియమణి చెప్పుకొచ్చారు. ఈసారి ఇంకొన్ని పాత్రలను యాడ్ చేశామని సీరత్ కపూర్ చక్కగా నటించారని ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రియమణి సినిమాలలో కంటే ఎక్కువగా ఓటీటీలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తో కూడా ఆమె ఆకట్టుకున్నారు. ఇక తెలుగులో భామ కలాపం మొదటి సీజన్ తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు భామ కలాపం 2 తో కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే ఆహాలు స్ట్రీమింగ్ అవుతున్న భామకలాపం సూపర్ హిట్ అంటున్నారు సీజన్ 1 కి మించి సీజన్ 2 ఉందని , దర్శకుడు అభిమన్యు సినిమాను అద్భుతంగా మలుపు తిప్పారని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది