Vijay Devarakonda : విజయ్ దేవరకొండను ఇంకా అవి వెంటాడుతున్నాయా..?
Vijay Devarakonda : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతటి క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. డిఫరెంట్ జోనర్ సినిమాలను చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే పెళ్లి చూపులు, గీత గోవిందం లాంటి క్లాస్ సినిమాలు చేసినా కూడా ఇంకా అర్జున్ రెడ్డి సినిమా ప్రభావమే విజయ్ మీద ఉంది. దీనితో పాటు గత చిత్రాల పరాజయం ప్రభావమూ వెంటాడుతుందని టాక్ వినిపిస్తోంది. చెప్పాలంటే విజయ్ కి హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా పడ్డాయి. మంచి క్రేజ్ ఉన్న సమయంలో నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
వాటి ప్రభావం ఇంకా ఈ హీరోను వెంటాడుతున్నాయట. అందుకే, ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో పక్కాగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా అయితే, దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న లైగర్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా పూరి స్టైల్‌లో రిలీజ్ కాలేదు. ఎలాంటి సినిమా అయినా ఎంత పెద్ద హీరో ఉన్నా పూరి తన సినిమాను రిలీజ్ చేయడానికి కావాల్సింది 5 నెలలు మాత్రమే. కానీ, మొదటిసారి లైగర్ విషయంలో అది మిస్ అయింది. అదీ కాక ఇప్పుడు పూరితోనే విజయ్ రెండవ సినిమాను చేస్తున్నాడు.

problems chasing on Vijay Devarakonda
Vijay Devarakonda : మళ్ళీ పూరిని కామెంట్స్ చేయడం మొదలుపెడతారు.
పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అయితే, లైగర్, జేజీఎం బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ, ఇక్కడ ఓ విషయం అందరికీ తెలిసిందే. పూరి సినిమా హిట్ అయితే భారీ హిట్. లేదంటే డిజాస్టర్. ఇది దృష్ఠిలో పెట్టుకునే లైగర్ తర్వాత జనగణమన సినిమా కాకుండా సమంత హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ఖుషి సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే, లైగర్, జనగణమన సినిమాల మధ్య ఏడాది గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా లైగర్ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవ్వాలి. లేదంటే మళ్ళీ పూరిని కామెంట్స్ చేయడం మొదలుపెడతారు.