Balagam Movie : 15 రోజుల్లో బలగం సినిమా ద్వారా దిల్ రాజు ఎంత సంపాదించాడో తెలుసా ?

 Authored By prabhas | The Telugu News | Updated on :19 March 2023,4:00 pm

Balagam Movie : ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించిన ‘ బలగం ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వేణు. ఇక జబర్దస్త్ షోలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా వేణు బలగం సినిమాని దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శన్, హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. చాలా సినిమాలలో హీరోకి ఫ్రెండ్ గా నటించిన ప్రియదర్శి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

producer Dil Raju Balagam Movie collections

producer Dil Raju Balagam Movie collections

ఇక ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక హీరో ప్రియదర్శన్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. విడుదలైన మొదటి రోజు భారీ కలెక్షన్ లు సాధించింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ప్రపంచ స్థాయిలో 15 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. నైజాం ఏరియాలో 15 రోజుల్లో బలగం సినిమా 9 కోట్ల కలెక్షన్ లు సాధించింది. ఆంధ్ర మరియు సీడెడ్ లో ఐదు కోట్ల కలెక్షన్లు దక్కాయి.

HBD Dil Raju, Comedian Venu: దిల్ రాజు ఎఫెక్ట్‌.. డైరెక్ట‌ర్‌గా మారిన  క‌మెడియ‌న్‌ - comedian venu eldandi turns director with balagam movie under dil  raju production - Samayam Telugu

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అలాగే ఈ సినిమాకి కేరళ మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 35 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. బలగం సినిమా విడుదలై 15 రోజులు అవుతున్న భారీ కలెక్షన్స్ సాధించడంతో సినిమా యూనిట్ ఆనందం వ్యక్తపరుస్తుంది. ఇక ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు మరోసారి సక్సెస్ నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఉన్నాడు. ఇక హీరోగా ప్రియదర్శి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి