Viral News : ఆ గ్రామంలో బ‌ల‌గం సినిమా రిపీట్‌.. మూలుగ బొక్క కోసం పెళ్లి ర‌ద్దు..!

Authored By aruna | The Telugu News | Published on: December 24, 2023, 12:00 pm
  •  Viral News : ఆ గ్రామంలో బ‌ల‌గం సినిమా రిపీట్‌..

  •  మూలుగ బొక్క కోసం పెళ్లి ర‌ద్దు..!

Viral News : బలగం సినిమాలోని మూలుగ బొక్క కోసం బావా బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తు ఉండి ఉంటుంది. పెళ్లి తర్వాత పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి బొక్క వేయకపోవడంతో బావ బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ ఆ కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది. ఏకంగా కొన్నేళ్లపాటు బావ బామ్మర్దులు దూరంగా ఉంటారు. ఈ ఒక్క సీన్ బలగం సినిమాకి హైలెట్ గా నిలిచింది. బలగం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఈ సీన్ కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అయితే అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ చివరకు పెళ్లి సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్ళింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన అబ్బాయికి, నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది.

ఇరు కుటుంబ సభ్యులు కట్న కానుకలు కూడా మాట్లాడుకున్నారు. అక్కడి వరకు అంత సాఫీగానే సాగింది. ఇక నవంబర్ మొదటి వారంలో వివాహ నిశ్చితార్థం సందర్భంగా ఆడపిల్ల వారి ఇంట మాంసాహారంతో భోజనాలు పెట్టారు. అబ్బాయి తరఫు బంధువులు మూలుగ బోక్క కావాలని అడిగారు. లేదని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. మూలుగ బొక్క గొడవ చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరు వర్గాల దాడికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను శాంతింప చేసినప్పటికీ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వివాహ సమయంలో ఒక్కోసారి చిన్న చిన్న విషయాల పెద్ద గొడవకు కారణం అవుతాయి. చిన్న గొడవలే పెద్ద గొడవలుగా మారుతాయి. ఎవరో ఒకరు సర్దుకుంటే గొడవలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా గొడవలు పెట్టుకుని వివాహ సంబంధాన్ని రద్దు చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇరు కుటుంబాలు ఇష్టపడి, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడి, నిశ్చితార్థం వరకు వెళ్లిన పెళ్లి ఇలా ఒక చిన్న కారణంతో పెళ్లిని రద్దు చేయడం ఏ మాత్రం సరి కాదని అక్కడి స్థానికులు అంటున్నారు. దీంతో అచ్చం బలగం సినిమాలోని సీన్ ఈ గ్రామంలో రిపీట్ అయిందని మేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp