Balagam Movie : యువకుడి ప్రాణం తీసిన “బలగం” మూవీ..!!
Balagam Movie : రీసెంట్ గా తెలుగులో విడుదలైన సినిమాలలో “బలగం” అతిపెద్ద విజయం సాధించటం తెలిసిందే. ఒకప్పుడు కమెడియన్ జబర్దస్త్ అంటే షోలలో రాణించిన వేణు తీసిన ఈ సినిమా చాలామంది ప్రముఖులను ఆకట్టుకుంది. ఈ సినిమా చూసి దర్శకుడు వేణు అని మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఇంకా చాలామంది ప్రముఖులు అభినందించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విడిపోయిన కుటుంబాలను కలుపుతూ ఉంది. కాగా ఒకప్పుడు ఊరంతా కలిసి తెరపై సినిమాలు చూసే పరిస్థితి ఉండేది.
రాను రాను అటువంటి పరిస్థితులు కనుమరుగైపోయాయి. కానీ తాజాగా బలగం సినిమా మళ్లీ అటువంటి వాతావరణం తెలంగాణలో అనేక జిల్లాలలో గ్రామాలలో తీసుకురావడం జరిగింది. బలగం సినిమాని తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ గ్రామాలలో వేసుకొని.. సినిమాలో సన్నివేశాలు చూసి ఏడుస్తూ ఉన్నారు. ఆ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఇలా ఉంటే ఈ రకంగానే జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామంలో
ఆదివారం రాత్రి బలగం సినిమా ఊరంతా కలిసి చూడటం జరిగింది. అయితే అదే సమయంలో ఆ ఊరిలో యువకులు మద్యం తాగి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది. ఈ గొడవలో ఓ యువకుడి ప్రాణం పోయింది. దీంతో సమాచారం అందుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. గుర్రం ప్రవీణ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ వర్గానికి చెందిన వాళ్ళు ఇనుప రాడ్లు పట్టుకుని దాడి చేయడంతో ఒకరు మరణించగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
