Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి ఆస్తులు ఎంత? అకీరా పేరుపై ప్రాపర్టీస్ ఉన్నాయా?
Pawan Kalyan : చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు పవన్ కళ్యాణ్. రెండుదశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పటికీ ఈయన ఎలాంటి హంగు ఆర్భాటాలకు వెళ్లరు. ఎంతో సాదా జీవితాన్ని గడుపుతారు. పవన్ కళ్యాణ్ ఒక్కో చిత్రానికి రూ 50 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన పవర్ స్టార్ ఆస్తుల విలువ ఎవరూ ఊహించలేని అంత ఎక్కువ ఉండాలి.
Pawan Kalyan : ఆస్తుల చిట్టా ఎంత?
కానీ ఇతర స్టార్ హీరోలకు ఉన్నత రేంజ్ ల్ పవన్ కళ్యాణ్ ఆస్తులు లేవని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా జనసేన పార్టీని నడుపుతున్నారు. ఆ భారం కూడా ఉంది కనుక ఆస్తులు ఎక్కువగా పోగేసుకోలేదు. పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ 200 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి జూబ్లీ హిల్స్ లో ఖరీదైన ఇంటితో పాటు.. హైదరాబాద్ శివారులో 18 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ విలువ పాతిక కోట్ల వరకు ఉంటుంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వద్ద మెర్స్డ్ బెంజ్ ఆర్ క్లాస్ కారు, వోల్వో ఎక్స్ సి 90, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి క్యూ7 లాంప్ ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక తన సతీమణి అన్నా లెజినోవా వద్ద 30 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
తన పెద్ద కుమారుడు అకీరా పేరుమీద 1.5 కోట్లు, కుమర్తె ఆద్య పేరుపై 1.04 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పేరుపై, మరో కుమార్తె పోలేనా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. పవన్ కళ్యాణ్ దాదాపు 30 కోట్లకి పైగా అప్పు కూడా ఉన్నట్లు సమాచారం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా పవన్ కళ్యాణ్ రెండున్నర కోట్ల అప్పు ఉన్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే భారీగానే రెమ్యునరేషన్ వచ్చే అవకాశమున్నా.. తన సిద్ధాంతాలకు వ్యతిరేకమని పవన్ వాటి జోలికి వెళ్లడం లేదు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాల్లో సంపాదన అంతా ప్రజాసేవకే ఖర్చు చేస్తున్నారు.. దీంతో పవన్ కు ఉన్న ఆదాయానికి భారీగా ఆస్తులు కూడబెట్టుకునే లేకుండా పోయింది.