Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 5 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా రివ్యూ కోసం అక్షయ్ కుమార్ మాస్క్ ధరించి థియేటర్ ముందు రివ్యూస్ అడిగి తెలుసుకున్నాడు.

Public Talk మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk నిజంగా సూప‌ర్బ్‌..

మాస్క్ లో ఉన్న అక్షయ్ కుమార్ ను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఒకొక్కరి దగ్గరకు వెళ్లి రివ్యూలు అడుగుతూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్, రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హౌస్‌ఫుల్ 5’. హౌస్ ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్ లో విడుదలైంది

ఒక క్రూజ్ షిప్ లో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమాను రూపొందించారు. జాలీగా సాగుతున్న ఈ ముగ్గురి జీవితంలో అనుకోని హత్యా నేరం ఎలాంటి మార్పులకు దారితీసింది అనేది సినిమా కథ. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే, జానీ లివర్, శ్రేయాస్ షర్నో మోరేనా, శ్రేయాస్ షర్నో మోరెనార్, రాంకీ తల్పాడే, ధీర్, జానీ లీవర్, ఆకాష్‌దీప్ సబీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన హౌస్ ఫుల్ 1,2,3,4 సీరీస్ లు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది