Punarnavi Bhupalam : పెళ్లి కాకుండానే తల్లి అయిన పునర్నవి .. తండ్రి ఎవరో తెలుసా ..?

Advertisement

Punarnavi Bhupalam : రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన పునర్నవి ఆ సినిమాతో ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పేరును పాపులర్ చేసుకుంది. ఈ రియాల్టీ షో ద్వారా పునర్నవికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీనికి కారణం లేకపోలేదు బిగ్బాస్ లో తన తోటి కంటెస్టెంట్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె చేసిన హంగామా అంతా అంతా కాదు.

Punarnavi Bhupalam baby bump photoes viral
Punarnavi Bhupalam baby bump photoes viral

బిగ్బాస్ లో తన ఆటతో కూడా అభిమానులను అలరించింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి ఇద్దరు ఎంత క్లోజ్ గా ఉండే వారంటే బయటకు వచ్చాక నిజంగానే పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు. బిగ్బాస్ నుంచి బయటికి వచ్చాక చాలా రోజులు ఇద్దరు కలిసి తిరిగారు. అయితే ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంది. తన నెక్స్ట్ స్టెప్ కోసం లండన్ వెళ్తున్నట్లు ఇదివరకే చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్ గా తన బేబీ బంప్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ ని చూసిన నెటిజన్లు ఆమె తల్లి కాబోతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Punarnavi Bhupalam baby bump photoes viral
Punarnavi Bhupalam baby bump photoes viral

అయితే పునర్నవి పోస్ట్ చేసిన ఫోటోలలో బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో ఆమె నిజంగానే తల్లి కాబోతుంది అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే ఆమె కొంతకాలం నుంచి తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది అన్న విషయం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తను బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయడంతో డేటింగ్ మ్యాటర్ నిజమే అని తెలుస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే పునర్నవి తన బేబీ బంప్ ఫోటో పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా పునర్నవి పోస్టుతో అభిమానులు షాక్ అయిపోయారు.

Advertisement
Advertisement