Punarnavi : పునర్నవి యోగా వీడియో.. అమ్మడి ఆసనాలు మామూలుగా లేవు

Advertisement

Punarnavi : పునర్నవి భూపాలం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పిట్టగోడ, ఉయ్యాల జంపాల సినిమాల్లో కనిపించి మెప్పించింది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలో శర్వానంద్ కూతురిగా నటించింది. అయితే ఇలా వెండితెరపై ఎన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్ద క్రేజ్ అయితే రాలేదు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి పునర్నవి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో పునర్నవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ట్రాక్ ఎంతగా వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవ్వడానికి ఒక రకంగా పునర్నవి కూడా ఓ కారణమే.

ఆమెతో నడిపించిన ఈ ట్రాక్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. రాహుల్ పునర్నవి జోడికి నెట్టింట్లో మంచి మార్కులే పడ్డాయి. అయితే బయటకు వచ్చాక మాత్రం అంత క్లోజ్‌గా కనిపించలేదు ఈ ఇద్దరూ. ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించారు. ప్రేమ, పెళ్లి అనే కథనాలు ఎక్కువగా వస్తుండటంతో ఇలా ఈ ఇద్దరూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టున్నారు. మొత్తానికి పునర్నవి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వెబ్ సిరీస్ గానీ, సినిమాల్లోగానీ నటించలేదు. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ చేసింది. దాని ప్రమోషన్లలో భాగంగానే తనకు ఎంగేజ్మెంట్ అయిందని స్టంట్ వేసింది. తీరా చూస్తే అదంతా కూడా తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ అని చెప్పేసింది.

Advertisement
Punarnavi Bhupalam Yoga Day 2022 Video
Punarnavi Bhupalam Yoga Day 2022 Video

పునర్నవి ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతుంటుంది. ఆ మధ్య ఓ సారి తన ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా వాడుతున్నారంటూ మీడియా మీద కూడా మండి పడింది. తన యోగా వీడియోలను, ఫోటోలను పిచ్చి పిచ్చిగా రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే పునర్నవి ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటోంది. అక్కడే గత కొన్నేళ్లుగా ఉంటోంది.తాజాగా పునర్నవి యోగా డే సందర్భంగా ఓ వీడియోను వదిలింది. అందులో తన అందాలను చూస్తే జనాలు ఫిదా అవ్వాల్సిందే. పొట్టి బట్టల్లో పునర్నవి అందాల విందు చేసేసింది.

Advertisement
Advertisement