Punarnavi : బిగ్ బాస్‌లో రచ్చ చేసిన ముద్దుగుమ్మ విదేశాల‌లో కేక పెట్టిస్తుందిగా..!

Advertisement

Punarnavi : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో ఎంతో మంది త‌మ అంద‌చందాల‌తో పాటు ప‌ర్‌ఫార్మెన్స్‌తో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. వారిలో పున‌ర్న‌వి ఒక‌రు. పునర్నవి భూపాలం అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో అనేక సినిమాలు చేసినా ఈ భామ క్రేజ్ తెచ్చుకున్నది మాత్రం బిగ్ బాస్ హౌస్ లోపలే. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఉయ్యాల జంపాల అనే సినిమాలో సునీత అనే పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన పునర్నవి ఆ తర్వాత కూడా తెలుగులో సినిమాలు చేసింది కానీ ఆమె మాత్రం ఒక్కటి హిట్ కూడా పడలేదు.ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ నెస్ తగ్గించేసి.. తన స్టడీస్‌కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది పునర్నవి.

Punarnavi : పున్నూ కేక‌..

అయితే ఎంతైనా లండన్‌లో చదువు అంటే పార్టీలు.. పబ్‌లు.. ఫ్రెండ్స్ ఇవన్నీ కామన్ కాబట్టి.. ఆ ఫొటోలను కూడా వదలుతూ ఉంది. అయితే తాజాగా ఆమె తన ఇన్ స్టా‌గ్రామ్‌లో షేర్ చేసిన వీడియా కేక పెట్టిస్తుంది. క‌నిపించి క‌నిపించ‌ని అందాల‌తో కిరాకు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ప్ర‌స్తుతం పునర్న‌వికి సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఒకప్పుడు క్యూట్ ఫొటోలు.. వర్కౌట్స్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కించిన పునర్నవి.. లాంగ్ గ్యాప్ తరువాత ఆ రేంజ్‌లోవీడియో వదిలింది.

Advertisement
punarnavi sharing interesting video
punarnavi sharing interesting video

‘ఉయ్యాల జంపాల’ అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది పునర్నవి భూపాలం. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘మనసుకు నచ్చింది’, ‘ఈ సినిమా సూపర్ హిట్’, ‘ఎందుకో ఏమో’ సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు గుర్తింపు మాత్రం దక్క లేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మరికొన్నింట్లో సపోర్టింగ్ రోల్స్‌ చేసినప్పటికీ ఆమెకు క్రేజ్ రాలేదు. బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది.

Advertisement
Advertisement