Punch Prasad : ఉండవయ్యా స్వామీ!.. పంచ్ ప్రసాద్ పరువుతీసిన భార్య
Punch Prasad : జబర్దస్త్ షోలో పంచ్ ప్రసాద్ ఎంతగానో ఫేమస్ అయ్యారు. ఆయన వేసే పంచ్‌లకు ఎవ్వరైనా నవ్వాల్సిందే. అయితే ఆయన పర్సనల్ జీవితంలో ఎన్ని కష్టాలున్నా కూడా అందరినీ నవ్విస్తుంటాడు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన ప్రసాద్.. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ అంటూ అన్ని షోల్లో నవ్విస్తూ వస్తున్నాడు.
ప్రసాద్ తన భార్య గురించి ఎంతో గొప్పగా చెబుతుంటాడు. ప్రసాద్ రెండు కిడ్నీలు పాడైపోవడంతో ఆమె బంధువులు సైతం వదిలిపెట్టమని సలహా ఇచ్చారట. కానీ తన భర్త కోసం నిలబడటమే కాకుండా, ఆమె ఓ కిడ్నీ ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. అలా భర్త కోసం ఎవ్వరూ చేయని సాహసం చేసేందుకు సిద్దమైంది. వారికి ఉన్న బాబు కాస్త పెద్దగా అయ్యే వరకు ఆ ఆపరేషన్‌ను వాయిదా వేశారు.

Punch Prasad And His Wife Skit In Sridevi Drama Company
Punch Prasad : పంచ్ ప్రసాద్ భార్య హల్చల్..
తాజాగా తన భార్య గురించి చెబుతూ సెటైర్లు వేశాడు. వచ్చే వారం వాలెంటైన్స్ డే స్పెషల్‌గా శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. నాకు కిడ్నీలు ఇచ్చేందుకే నన్ను పెళ్లి చేసుకుంది.. నాలుగేళ్లు అవుతోంది.. ఇంకా కిడ్నీ ఇవ్వలేదు అని కౌంటర్ వేశాడు ప్రసాద్. ఉండవయ్యా స్వామీ.. అవేమైనా ఇడ్లీలా? అడగ్గానే ఇవ్వడానికి అని భర్త మీద కౌంటర్ వేసింది.