Jabardasth : జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?
Jabardasth : బుల్లితెరపై ఎంతో మందికి మంచి పాపులారిటీ తెచ్చిన షో జబర్దస్త్ Jabardasth. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్న వారికి మంచి ప్లాట్ ఫాం ఇచ్చి పాపులర్ కమెడియన్స్ గా ఎదిగేలా చేసిన ఈ కామెడీ షో గత 8 – 9 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇందులో అవకాశం అందుకున్న కొద్ది కాలానికే అందరు ఆర్ధికంగా బాగా సెటిలయ్యారు. ఇక యాంకర్స్ రష్మీ, అనసూయ సినీ తారల మాదిరిగా వెలుగుతున్నారు. అయితే గత ఏడాది నుంచి కరోనా వెంటపడి తరుముతూనే ఉంది.

mallemaala gave shock ro jabardasth team regarding remuniration
ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లతో కొన్ని కోట్ల మంచికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్యాండమిక్ సిచువేషన్ లో కొన్ని లక్షల మంది ఉపాది కోల్పోగా.. కొన్ని వేలమందికి జీతాల్లో కోతలు పడ్డాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా నిర్మాతలు రెమ్యునరేషన్ తగ్గించారు. పరిస్థితులను అర్థం, చేసుకొని హీరో, హీరోయిన్స్ మాత్రమే కాకుండా 24 విభాగాలకి చెందిన వారందరు తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. ఇదే క్రమంలో మల్లెమాల నిర్మాణంలో వస్తున్న జబర్దస్త్ Jabardasth, ఎక్స్‌ట్రా జబర్దస్త్ Jabardasth వారికి బాగానే కోతలు పడ్డాయట. అదేంటో చూద్దాం.

mallemaala gave shock ro jabardasth team regarding remuniration
ముందుగా జడ్జిల రెమ్యునరేషన్ నుంచి పరిశీలిస్తే రోజా ఒక్కో ఎపిసోడ్‌కు మొన్నటి వరకు 3 నుంచి 4 లక్షలు తీసుకునేదని సమాచారం. అయితే నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈమె పారితోషికం డబుల్ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన నెలకు 8 ఎపిసోడ్లు.. అక్షరాలా 30 లక్షల వరకు రోజాకు అందుతున్నట్టు అర్థమవుతోంది. నాగబాబు ఉన్నపుడు 20 లక్షలకు పైగానే సంపాదించారట. ఇప్పుడు ఆయన స్థానంలో మనో వచ్చి చేసారు. ఆయనకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 2 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇక యాంకర్స్ రెమ్యునరేషన్ మాత్రం పెరిగాయట..! Jabardasth
ఇక యాంకర్స్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. రష్మి Rashmi, అనసూయ ఎపిసోడ్‌కు మొన్నటి వరకు 50 నుంచి 80 వేలు అందుకునేవారట. కానీ ఇప్పుడు మాత్రం లక్ష కి పైగానే అందుకుంటున్నారట. అనసూయ భరద్వాజ్ Anasuya ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కోసం 1.20 లక్షలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. ఆమెకి సినిమాల పరంగా ఉన్న క్రేజ్ వల్లే ఈ రెమ్యునరేషన్. రష్మి కూడా దాదాపు లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. వీళ్ళ నెల ఆదాయం ఇప్పటి లెక్కల ప్రకారం 4 నుంచి 5 లక్షల వరకు ఉందనేది సరాసరి అంచనా.

mallemaala gave shock ro jabardasth team regarding remuniration
అలాగే టీమ్ లీడర్ల విషయంలో చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేవాడు. ఈయన ఉన్నపుడు 3 నుంచి 4 లక్షలు సంపాదించాడట. సుడిగాలి సుధీర్ టీంతో పాటు హైపర్ ఆదికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. వీళ్ళకు లక్షల్లోనే పారితోషికం అందుతుందని సమాచారం. హైపర్ ఆది టీమ్ కూడా మొన్నటి వరకు 2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇంతక ముందు ఒక్కో ఎపిసోడ్‌కు 3 నుంచి 3.5 లక్షలు అందుకున్న సుధీర్.. ఇప్పుడు 4 లక్షల వరకు తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.

mallemaala gave shock ro jabardasth team regarding remuniration
సాఫ్ట్ వేర్ నుంచి వచ్చిన అదిరే అభి 2 లక్షలు తీసుకుంటున్నాడట. ఇక జబర్దస్త్ కట్టప్ప రాకెట్ రాఘవ అందుకుంటున్న రెమ్యునరేషన్ 2.75 లక్షలని తెలుస్తుంది. భాస్కర్ అండ్ టీం 2 లక్షలు కాగా, చలాకీ చంటి 2 లక్షలు అంటున్నారు. ఇక సునామీ సుధాకర్, కెవ్వు కార్తిక్ కూడా లక్షల్లోనే సంపాదిస్తున్నారట. ఈ షోకి ఉన్న పాపులారిటీతో చూసుకుంటే ఈ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడం తప్పేం కాదంటున్నారు. జబర్దస్త్ షోలో మార్పుల తర్వాత పారితోషికాలు కూడా బాగానే మారాయి. కొంతమందికి రేటింగ్ రావడం లేదని ఏకంగా తీసేశారు. అయితే ఈ ఏడాది మాత్రం ఎవరికి రెమ్యునరేషన్ పెంచే ఆలోచనలో మల్లెమాల వారు లేరని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి ==> పూర్తిగా భ్రష్టు పట్టించిన తమన్.. దిగు దిగు నాగ అంటూ ఛండాలం.. వీడియో!
ఇది కూడా చదవండి ==> కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. ఈ సారి అంతకు మించేలా?
ఇది కూడా చదవండి ==> కష్టాల్లో జబర్దస్త్ చంటి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేక అలా!