Punch Prasad : ఆయన వచ్చాక లైఫ్‌లో అది లేకుండా పోయింది.. ఏడిపించిన పంచ్ ప్రసాద్ భార్య
Punch Prasad : జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి, ఆయనకున్న ఆరోగ్య సమస్యల గురించి అందరికీ తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ మీద నిత్యం జీవనాన్ని సాగిస్తున్నాడు. త్వరలోనే ఆయనకు రెండు కిడ్నీలకు ఆపరేషన్ చేస్తారు. అయితే ఆ కిడ్నీలను దానం చేసేది మరి ఎవరో కాదు ఆయన భార్యే. భర్త కోసం ఓ కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చింది.పంచ్ ప్రసాద్ తన భార్య గురించి ఎన్నో ఈవెంట్లు, వేదికల మీద చెప్పుకొచ్చాడు.
తన భార్య గొప్పదనం గురించి చెబుతూ అందరినీ ఏడిపిస్తుంటాడు. ఇక ఈ ఇద్దరి ప్రేమ వివాహానికి ఎన్నో అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. కిడ్నీలు పాడయ్యాయ్.. ఎంతకాలం బతుకుతాడో తెలియదు.. అలాంటి వాడితో ఎందుకు అని ఇంట్లో వాళ్లు అన్నారట. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే చాలు అని తన భార్య ఎంతో గొప్పగా చెప్పేసిందట.అలా మొత్తానికి పంచ్ ప్రసాద్ భార్య మాత్రం బుల్లితెరపై బాగానే ఫేమస్ అయింది. అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లలో ఆమె మెరుస్తుంటుంది.

Punch Prasad Wife emotional in Sitaramula Kalyanam Chutamu Rarandi
తాజాగా శ్రీరామ నవమి కోసం ఈటీవీ చేస్తోన్న శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే ఈవెంట్‌లో పంచ్ ప్రసాద్ భార్య వచ్చింది. తన భర్త గురించి చెబుతూ అందరినీ ఏడిపించింది.ప్రతీ అమ్మాయి జీవితంలో కొన్ని చేదు అనుభవాలు, సాడ్ మూమెంట్స్ ఉంటాయ్.. కానీ ఈయన వచ్చాక నా లైఫ్‌లో అవి లేకుండా పోయాయ్ అంటూ తన భర్త తనను ఎంత బాగా చూసుకుంటాడో చెప్పకనే చెప్పేసింది. వీరి అన్యోన్య దాంపత్యానికి జనాలు అంతా ఫిదా అవుతున్నారు.
