Shruti Haasan : పూరి జగన్నాథ్ డైలాగ్స్ అన్నీ శ్రుతి హాసన్ కే సూటవుతున్నాయా..?
Shruti Haasan : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ..డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ సినిమా ఎలా ఉన్నా..అందులో డైలాగ్స్ మాత్రం జనాల మీద చాలా ప్రభావం చూపిస్తుంటాయి.అంతేకాదు, పూరి పెన్నుకు పదునెక్కువ. హీరో స్వభావాన్ని ఒకే ఒక్క డైలాగ్‌తో చెప్పగలిగే టాలెంట్ ఉన్న ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్‌తో దర్శకుడిగా పరిచయమవుతూ పూరి తీసిన మొదటి సినిమా బద్రి. ఇందులో ఉన్న పవన్ డైలాగ్..’నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్.. అయితే ఏంటీ’.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.’సిటీకి ఎంతో మంది కమీషనర్లు వస్తుంటారు పోతుంటారు..
చంటిగాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు.. లోకల్’.., ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకైపోద్దో ఆడే పండుగాడు’, ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే విన్ను’, ‘జీవితం ఎవ్వరినీ వదిలిపెట్టదు..అందరి సరదా తీర్చేస్తుంది’..ఇలాంటి డైలాగులన్నీ పూరి జగన్నాథ్ తప్ప ఇంకెవరూ రాయలేరు. ఇక పూరి మ్యూజింగ్స్ అంటూ కూడా చిన్న చిన్న కథలను కరోనా సమయంలో చెప్పారు పూరి. ఇవి దాదాపు అందరి జీవితాలో జరిగేవే. కానీ ఎవరూ వాటిని గుర్తించరు.అయితే, పూరి రాసిన డైలాగ్స్ ..ఆయన చెప్పిన మాటలు అచ్చుగుద్దినట్టుగా విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌కు సూటవుతున్నాయి.
Shruti Haasan : రియల్ లైఫ్‌లో ఎలా బ్రతకాలో తెలుసుకున్నా..
ఆయన చెప్పినట్టుగానే జీవితంలో సరదా తీరాక గానీ ఏవరిలోనైనా ఓ రియలైజేషన్ వస్తుంది. ఇది నిజం అంటోంది శృతి. ఎదుటివారికి నచ్చినట్టుగా బ్రతకడం కాదు నీకు నచ్చినట్టుగా బ్రతకడమే జీవిత..అని పూరి చెప్పాడు. అదే ఇప్పుడు శ్రుతి హాసన్ గుర్తు చేసుకొని..అలా ఎదుటి వారికి నచ్చినట్టు ఉండాలనుకొని ఎంతో మంది స్నేహితులను, తన ఆనందాలను, కోల్పోయానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రియల్ లైఫ్‌లో ఎలా బ్రతకాలో తెలుసుకున్నాని అంటోంది. మొత్తానికి శృతి చెప్పినట్టు పూరి రాసిన మాటలు జనాలపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయో దీన్ని బట్టే అర్థమవుతోంది.