Puri jagannath: బద్రి తర్వాత మూడు కథలు పవన్ కళ్యాణ్ కోసమే రాశాను..ఒక్కటి కూడా ఒప్పుకోలేదు: పూరి జగన్నాథ్
Puri jagannath: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బద్రి సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కి మొదటిది కావడం విశేషం. అయినా పూరి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ కథ విని వెంటనే నిర్మాతను సెట్ చేశాడు. అలా బద్రి వచ్చి భారీ హిట్ అందుకుంది. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో చాలా ఏళ్లకి కెమెరా మేన్ గంగతో రాంబాబు సినిమా వచ్చింది. ఈ సినిమా పొల్టికల్ అండ్ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది.

puri-jagannath-three stories are exclusively written for pawan kalyan
దాంతో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను తీసేయాల్సి వచ్చింది. అలా కథ కాస్త డ్రై అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే బద్రి – కెమెరా మేన్ గంగతో రాంబాబు తో సినిమాల మధ్యలో మూడు కథలు పూరి పవన్ కళ్యాణ్ కోసమే రాశాడు. ఈ విషయం ఎన్నో సందర్భాలలో కూడా పూరి చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలే ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, పోకిరి. ఈ మూడు సినిమాలు పూరి డైరెక్షన్‌లో వచ్చి భారీ హిట్ అందుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాల కథలు ముందు పవన్ విన్నాడు.
Puri jagannath: ఇడియట్ కథ రవితేజ కంటే ముందు పవన్ విన్నాడు.
ఇడియట్ కథ రవితేజ కంటే ముందు పవన్ విన్నాడు. కథ బావుంది అన్నాడు కాని చేస్తానని చెప్పలేదు. అలాగే అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి కూడా కథ మొత్తం విని చాలా బావుందని పూరికి చెప్పిన పవర్ స్టార్ చేద్దాం పదా అని మాత్రం మాటివ్వలేదు. ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 75 ఏళ్ళ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టిన సినిమా పోకిరి. ఈ సినిమా కథ కూడా పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని పూరి రాసుకున్నాడు. కానీ ఎందుకనో ఈ సినిమాను పవన్ మిస్ అయ్యాడు. అలా పవన్ నటించాల్సిన మూడు సినిమాలు రవితేజ, మహేష్ బాబు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.