Mahesh Babu : నమ్రత వల్లే పూరి జగన్నాథ్ ని దూరం పెట్టిన మహేష్ బాబు ..!!

Advertisement

Mahesh Babu : ఒకప్పుడు ఇండస్ట్రీలో రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘ పోకిరి ‘ సినిమాతో మహేష్ బాబు ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగారు. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి కూడా టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత పూరి , మహేష్ కాంబినేషన్లో మరో సినిమా ‘ బిజినెస్ మాన్ ‘ వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ కాంబినేషన్లో మూడో సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టైంలోనే పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో పడ్డారు. స్టార్ హీరోలు ఎవరు పూరి కి కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితి లేదు.

Advertisement

ఈ క్రమంలోనే పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ జనగణమన ‘ సినిమాను మహేష్ బాబుతో తీయాలని కలలు కన్నారు. అయితే మహేష్ పూరితో సినిమా చేయాలని ఆసక్తి చూపడం లేదట. రెండు మూడుసార్లు పూరి జగన్నాథ్ మహేష్ బాబుకు ఫోన్ చేసిన ఎత్తలేదని అంటారు. ఒక ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ మనం ఫ్లాప్ లో ఉంటే మహేష్ బాబు అస్సలు కలవరు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇక అప్పటినుంచి మహేష్ పూరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటారు. అయితే తాజా ఇంటర్వ్యూలో పూరి మహేష్ బాబు పై అసంతృప్తిని అసహనాన్ని బయటపెట్టారు.

Advertisement
gap between Mahesh Babu and Puri Jagannadh
gap between Mahesh Babu and Puri Jagannadh

మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే మహేష్ అభిమానులకు నమ్మకం ఉంది కానీ మహేష్ కి లేదు అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ ను చాలాసార్లు కలవాలని ప్రయత్నించిన నమ్రత ఒప్పుకోలేదని అంటారు. అప్పటికే వరుస హిట్లతో ఉన్న మహేష్ వరుస ఫ్లాపులతో ఉన్న పూరితో సినిమా చేస్తే తన మార్కెట్ డౌన్ అవుతుందని నమ్రత కూడా పూరికి అస్సలు ఆపాయింట్మెంట్ ఇచ్చేది కాదట. అలా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ నమ్రత పెంచేసింది. ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని నమ్మకం అయితే లేదు.

Advertisement
Advertisement