Puri Jagannath Temple : పూరి జగన్నాథ్ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Puri Jagannath Temple : పూరి జగన్నాథ్ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,8:00 am

Puri Jagannath Temple : పూరి జగన్నాథ్ ఆలయం చాలా విశేషమైనది. అసలు ఈ దేవాలయం ఎలా ఏర్పడింది…ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి….? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ఆలయం అంటే తెలియని వారు అంటూ ఎవరూ లేరు. అంతటి గొప్ప విశిష్టత ఉంది ఈ దేవాలయానికి. మరి ఈ ఆలయం ఎలా ఏర్పడింది
అంటే ఓ పురాణ కథ వినాల్సిందే. పూర్వం ఇంద్రకీయుమునుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన ఒక రోజు విశ్వకర్మను తీసుకువచ్చి ఇలా వేప మొద్దులు , ఎదురు కర్రల తో విగ్రహాలను తయారు చేయించసాగాడు. అలా చేసేటప్పుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శిల్పి రూపంలో వచ్చాడు. అయితే విగ్రహాలు తయారు చేసే సమయంలో ఎవరు కూడా లోపటికి రావద్దు అని విశ్వకర్మ చెబుతాడు. అయితే ఆ గదిలో నుంచి శబ్దం మాత్రం వచ్చేది. తర్వాత రోజు శబ్దం రాకపోవడంతో మహారాజు తలుపులను తెలిసినప్పుడు శిల్పి అక్కడ లేడు కానీ విగ్రహాలు తయారయ్యాయి. ఇలా శ్రీమహావిష్ణువు ఇక్కడ కొలువ అయ్యాడు అని నమ్ముతారు. అలాగే రాజుగారు ఒక రోజు నదిలో స్నానం చేస్తుండగా ఒక ఇనుప రాడ్డు దొరుకుతుంది. రాజు గారి చెవిలో గుసగుసలాడుతూ… ఇది నా గుండె… పూరి జగన్నాథ్ ఆలయంలో పెట్టని శ్రీమహావిష్ణు చెప్పడం జరుగుతుంది. అలా పూరి జగన్నాథ్ ఆలయం ప్రారంభమైంది.

అదేవిధంగా సుదర్శన చక్రం. ఇది 20 అడుగులు ఉంటుంది. దీని బరువు 100 కిలోలు ఉంటుంది. అయితే దీనిని రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఎటు వైపు నుండి చూసిన అది మనల్ని చూస్తున్నట్లే కనిపిస్తుంది. 100 కేజీల బరువుని ఏనుగు మీద 45 అంతస్తుల బిల్లింగ్ కి తీసుకెళ్లి అక్కడ స్థాపించడం జరిగింది. అలాగే పూరి జగన్నాథ్ ఆలయం వద్ద సముద్ర శబ్దం అనేది వినిపించదు. ఎందుకంటే శ్రీమహావిష్ణువు భక్తులు వస్తారు కాబట్టి శబ్దం రాకుండా నీవు రక్షించు హనుమ అని ఆ బాధ్యతను ఆంజనేయ స్వామి వారికి అప్పగించారు. మరొక వింత ఏమిటంటే ఈ దేవాలయం చుట్టూ పక్షులు అనేవి ఉండవు. అలాగే వర్షం వచ్చినా ఎండ వచ్చిన గుడి యొక్క నీడ కనిపించదు. సైంటిఫికల్ గా చెప్పాలి అంటే గోపురం యొక్క నీడ గుడి మీదనే పడుతుంది అది ఎవరికీ కనిపించదు. ఇక ప్రసాదం విషయానికి… ఇక్కడ 2000 నుంచి 20 లక్షల మంది ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అమూల్య బియ్యం ఉంటాయి వాటితో ప్రసాదం చేస్తారు.అందుకే ఏ ఒక్కరు ప్రసాదం తీసుకోకుండా వెళ్లరు.

Puri Jagannath Temple పూరి జగన్నాథ్ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు

Puri Jagannath Temple : పూరి జగన్నాథ్ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు…!

అలాగే అక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. సాక్షాత్తు మహావిష్ణువు కాబట్టి ఇక్కడ అన్నం దొరకపోవడం అనేది జరగదు. అయితే ఇక్కడి ప్రసాదాన్ని ఏడు కుండలలో తయారుచేస్తారు. ఒక కుండ మీద ఒక కుండ మరొక కొండ అలా ఏడు కుండలు పెట్టి ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. ఇలా కేవలం పూరి జగన్నాథ్ ఆలయంలో మాత్రమే ఉంటాయి. అయితే ఈ విగ్రహాలను 8 -9 సంవత్సరాలకి ఒకసారి మారుస్తూ ఉంటారు. ఇలా జగన్నాథ్ స్వామిది, సుభద్ర అమ్మవారు, బలరాముడు ల విగ్రహాలు చేస్తారు. ఈ యొక్క దేవాలయంలోనే ప్రపంచంలో అత్యంత పెద్ద రథయాత్ర జరుగుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ్ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది