Pushpa 2 : క‌ళ్లు చెదిరే రేటుకి పుష్ప 2 ఓటీటీ రైట్స్.. చిత్రానికి ఇంత క్రేజా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pushpa 2 : క‌ళ్లు చెదిరే రేటుకి పుష్ప 2 ఓటీటీ రైట్స్.. చిత్రానికి ఇంత క్రేజా..!

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్పతో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పలు కార్పోరేట్ కంపెనీలు బన్నితో యాడ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. అంతేకాదు రీసెంట్‌గా ఈయన మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో హీరోగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 : క‌ళ్లు చెదిరే రేటుకి పుష్ప 2 ఓటీటీ రైట్స్.. చిత్రానికి ఇంత క్రేజా..!

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్పతో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పలు కార్పోరేట్ కంపెనీలు బన్నితో యాడ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. అంతేకాదు రీసెంట్‌గా ఈయన మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో హీరోగా నిలిచాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న పుష్ప 2 షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరగుతోంది. ఈ సినిమాపై తెలుగు సహా సౌత్‌తో పాటు నార్త్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది.

భారీ డిమాండ్..

తాజాగా పుష్ప 2 ఐదు భాషలకు చెందిన ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేవలం ఓటీటీ హక్కులే రూ.250 కోట్లకు అమ్మడుయినట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషలకు కలిపి ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సీక్వెల్ కున్న క్రేజ్ చూస్తుంటే సినిమాకు కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చిన ఊహకందని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టడడం ఖాయం అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.

Pushpa 2 క‌ళ్లు చెదిరే రేటుకి పుష్ప 2 ఓటీటీ రైట్స్ చిత్రానికి ఇంత క్రేజా

Pushpa 2 : క‌ళ్లు చెదిరే రేటుకి పుష్ప 2 ఓటీటీ రైట్స్.. చిత్రానికి ఇంత క్రేజా..!

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. ఫస్ట్ లుక్ చాలా స్టైలిష్ గా, గ్రాండియర్ గా ఉండాలనుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి.
అల్లు అర్జున్… పుష్ప 2 మూవీ తర్వాత వెంటనే పలు క్రేజీ సినిమాలను లైన్‌లో పెట్టాడు. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులను లైన్‌లో పెట్టుకున్నాడు. అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది