Pushpa 2 Movie : కొనసాగుతున్న సస్పెన్స్.. అసలు సుకుమార్ ఏం చేస్తున్నారో క్లారిటీ రావడం లేదే..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 14, 2022, 7:00 pm

Pushpa 2 Movie : పుష్ప 2 సినిమా విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అందుకే, ఈ మూవీ విషయంలో అసలు సుకుమార్ ఏం చేస్తున్నారో క్లారిటీ రావడం లేదే..? అంటూ బన్నీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్..ఆ వెంటనే ఈ మూవీ సీక్వెల్‌లో నటిస్తాడనే ప్రచారం జరిగింది. దర్శకుడు సుకుమార్ కూడా అదే ఊపులో అప్పుడు ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఫిబ్రవరిలోనే సినిమా సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసికురావాలని ప్లాన్ చేసుకున్నారు.అయితే, ఆ ప్లాన్స్ అన్నిటికీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చెక్ పెట్టాయి. వీటి సక్సెస్ ప్రభావం పుష్ప సీల్వెల్‌పై గట్టిగానే పడింది.

భారీ విజయం సాధించడంతో వాటిని మించి సక్సెస్ సాధించాలంటే సుక్కూ స్క్రిప్ట్ చాలనే మళ్ళీ స్టోరీ రాయడం మొదలుపెట్టారు సుకుమార్. ఇంకా దీనికి సంబంధించిన చర్చలు అల్లు అర్జున్ – సుకుమార్‌ల మధ్యన జరగలేదట. బన్నీ ఏమో ఎప్పుడెప్పుడు పుష్ప కంప్లీట్ చేస్తే వేరే ప్రాజెక్ట్ మీద వెళ్ళాలా అని ఎదురుచూస్తున్నారట.2021 క్రిస్మస్ కానుకగా వచ్చిన పుష్ప పార్ట్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిందని చెప్పక తప్పదు. కోవిడ్ మధ్య కూడా వరల్డ్ వైడ్ గా కలక్షన్ పరంగా వావ్ అనిపించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ డాన్ గా ఎదిగిన పుష్పరాజ్ తన ప్రయాణంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు..అనే విషయాన్ని కొత్తగా, స్పెషల్ గా పార్ట్ 2లో చూపించబోతున్నాడు.

Pushpa 2 Movie Sukumar Clarity is not coming

Pushpa 2 Movie Sukumar Clarity is not coming

Pushpa 2 : 6నెలల్లో పూర్తి చేసి వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు..?

జూలైలో ఫస్ట్ షెడ్యూల్ ను మొదలు పెట్టి వీలైనంత త్వరగా పుష్ప2 ని ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తాజా సమాచారం. పుష్ప 2 కథ విషయంలో అన్ని లెక్కల్ని సరిసమానంగా సెట్ చేసిన సుకుమార్ సినిమాను 6నెలల్లో పూర్తి చేసి వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడట. ఇక పార్ట్1లో సమంత స్పెషల్ సాంగ్ ఎంత హైలెట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సీక్వెల్ కోసం ఈసారి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని రంగంలోకి దింపబోతున్నారట. అలాగే బాలీవుడ్, కొలీవుడ్ నుంచి మూడు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఈ సీక్వెల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీటికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయట. మొత్తానికి పుష్పతో వండర్స్ క్రియేట్ చేసిన సుకుమార్ సీక్వెల్ తో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp