Pushpa 2 The Rule : ప్రీ సేల్ బుకింగ్స్‌లో పుష్ప‌2 ఊచ‌కోత‌.. ఏకంగా వంద కోట్ల‌పై కన్ను..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 The Rule : ప్రీ సేల్ బుకింగ్స్‌లో పుష్ప‌2 ఊచ‌కోత‌.. ఏకంగా వంద కోట్ల‌పై కన్ను..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 December 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 The Rule : ప్రీ సేల్ బుకింగ్స్‌లో పుష్ప‌2 ఊచ‌కోత‌.. ఏకంగా వంద కోట్ల‌పై కన్ను..!

Pushpa 2 The Rule : అల్లు అర్జున్ Allu arjun  హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల అవుతున్న ఈ సినిమా ప్రీ-సేల్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి.దాని ద్వారా చిత్రానికి సరికొత్త రికార్డులు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా హిందీ వెర్షన్‌లో కూడా ఈ చిత్రం టికెట్ అమ్మకాల్లో హవా చూపించింది.24 గంటల్లోనే ఒక లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా పుష్ప2 బాలీవుడ్‌లో అనేక పెద్ద చిత్రాల రికార్డులను అధిగమించింది.

Pushpa 2 The Rule ప్రీ సేల్ బుకింగ్స్‌లో పుష్ప‌2 ఊచ‌కోత‌ ఏకంగా వంద కోట్ల‌పై కన్ను

Pushpa 2 The Rule : ప్రీ సేల్ బుకింగ్స్‌లో పుష్ప‌2 ఊచ‌కోత‌.. ఏకంగా వంద కోట్ల‌పై కన్ను..!

Pushpa 2 The Rule పుష్ప మానియా..

పుష్ప 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటి వరకూ 6.6 లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. ఇందులో హిందీ వెర్షన్ కోసమే ఎక్కువ టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. టికెట్ల అమ్మకాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే నార్త్‌లోనే ఎక్కుగా జరిగినట్లు తెలుస్తోంది. నార్త్‌లో ఇప్పటి వరకూ 3,48,892 టికెట్లు అమ్ముడుపోగా.. తెలుగు వెర్షన్ కోసం 2,73,519 టికెట్లు సేల్ అయ్యాయి. ఓవరాల్‌గా ఈ సంఖ్య 6 లక్షలు దాటిపోయింది.ఇప్పటికే తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలానే ముంబయి, ఢిల్లీలో ఇప్పటికే రూ.1500 నుంచి 1700 వరకూ పుష్ప 2 మూవీ టికెట్ రేట్లు పలుకుతున్నాయి.

పుష్ప 2 మూవీ.. డిసెంబరు 5న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలి, హిందీ భాషల్లో రిలీజ్‌కాబోతోంది. ఈ మూవీ రూ.1000 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టే అవకాశం ఉండగ.. ఈ ఏడాది కల్కి మాత్రమే రూ.1000 కోట్ల మార్క్‌ని అందుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో 16.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీ బెల్ట్ లో 14.84 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. హిందీ భాషలో ఈ స్థాయిలో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రావడం అంటే పుష్ప 2కి అక్కడ ప్రేక్షకుల రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందనేది అర్ధం చేసుకోవచ్చు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది