Pushpa : పుష్పకు వచ్చిన 300 కోట్లు వదిలేసి ఇప్పుడు ఆ వివాదం ఎందుకురా నాయన?
Pushpa : ఈమద్య కాలంలో సినిమాల గురించి పాజిటివ్ మాట్లాడటం కంటే నెగటివ్ మాట్లాడటం ఎక్కువ అయ్యింది. సోషల్ మీడియాలో నెగటివ్ మాట్లాడటం వల్ల జనాల దృష్టిని ఆకర్షించవచ్చు అని.. అలా తమ ఫాలోయింగ్ ను పెంచుకోవచ్చు అంటూ చాలా మంది భావిస్తున్నారు. ఇందుకోసం కోడి గుడ్డు మీద ఈకలు పీకుతూ కొందరు హడావుడి చేస్తున్నారు. ప్రతి సినిమాకు కూడా ఏదో ఒక హడావుడి చేయడం కామన్ అయ్యింది. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా వివాదాలు అనేవి కామన్. ఇప్పుడు చిన్నా చితకా విషయాలను కూడా వివాదంగా లాగే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక కొందరు సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ కూడా పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమా సూపర్ హిట్ అయ్యింది. 2021 లో విడుదల అయిన ఇండియన్ సినిమాల్లో నెం.1 గా పుష్ప నిలిచింది. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా స్థాయిని స్టామినాను పుష్ప చూపించాడు. కరోనా సమయంలో ఒమిక్రాన్ ముంచుకు వస్తున్న సమయంలో పుష్ప రాబడుతున్న వసూళ్ల లెక్కలు.. నెంబర్ లు అంతా కూడా షాకింగ్ గా ఉన్నాయి. ఇంతటి షాకింగ్ వసూళ్లను దక్కించుకున్న పుష్ప గురించి కొందరు వృధా ఖర్చు అంటూ విమర్శలు మొదలు పెట్టారు.
Pushpa : పుష్ప నిర్మాతలకు 25 కోట్ల నష్టం కలిగించిన సుకుమార్
ప్రతి సినిమాను కూడా దర్శకుడు ఏదో ఊహించుకుని ఏదో తీస్తూ ఉంటాడు. కొన్ని సీన్స్ ను రెండు మూడు వర్షన్ లుగా తీస్తాడు.. కొన్ని అదనపు సీన్స్ తీస్తాడు. అలా సినిమా నాలుగు గంటలు కాస్త అటు ఇటుగా కూడా అవుతుంది. అందులోంచి బెస్ట్ పార్ట్ ను ఎడిట్ చేసి అప్పుడు దాన్ని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. వృదా లేకుండా ఏ దర్శకుడు కూడా సినిమాను తీయడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. పెద్ద ఎత్తున పుష్ప సినిమా కు వస్తున్న వసూళ్ల గురించి పట్టించుకోకుండా సుకుమార్ వృదా చేసిన నిర్మాతల కొద్ది మొత్తం డబ్బు గురించి కొందరు మాట్లాడుతున్నారు. సుకుమార్ చాలా సన్నివేశాలను తెరకెక్కించి వాటిని సినిమాలో పెట్టకుండా వదిలేశాడు. అంతే కాకుండా సినిమాను కూడా మూడు గంటలు తెరకెక్కించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా ను రెండున్నర గంటలు లేదా పావు తక్కువ మూడు గంటల్లో ముగిస్తే నిర్మాతకు చాలా లాభం ఉంటుంది. సినిమా ను మూడు గంటలు చూపించడంతో పాటు డిలీట్ చేసిన సన్నివేశాల వల్ల పుష్ప నిర్మాతలకు దాదాపుగా పాతిక కోట్ల మేరకు సుకుమార్ అదనపు భారం మోపాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఒక వైపు సినిమా 300 కోట్లు రాబట్టి నిర్మాతలకు వంద కోట్లకు పైగా లాభాలను తెచ్చి పెడితే పాతిక కోట్లు పది కోట్ల నష్టం అంటూ కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఏంట్రా బాబు. ఇంత పెద్ద సక్సెస్ దక్కించుకున్న పుష్ప గురించి ఎందుకురా ఈ చిల్లర లెక్కలు.. పంచాయితీలు అంటూ నెటిజన్స్ కొందరు వారిపై కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పుష్ప సినిమా ఏదో ఒక విధంగా ప్రతి రోజు మీడియాలో వార్తల్లో నిలుస్తుంది.