Pushpa : బన్నీ హీరోగా ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో నే కాదు, ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ 100 కోట్లకి పైగా రాబట్టడం విశేషం.ఇప్పుడు పుష్ప 2 సినిమా ప్లానింగ్స్ నడుస్తున్నాయి. సినిమా కోసం అడవి నేపథ్యంలో సుకుమార్ ఈ కథను రెడీ చేసుకున్నాడు. ముఖ్యమైన పాత్రలను ఆయన డిజైన్ చేసుకున్న తీరు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ప్రతి పాత్రకు ఆయన సెట్ చేసిన బాడీ లాంగ్వేజ్ .. మేనరిజమ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాంటి ఈ సినిమా కోసం బన్నీకి భారీ పారితోషికమే ముట్టిందనే టాక్ వచ్చింది.
అయితే ఈ సినిమా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ మ్యానరిజం, డైలాగ్‌లకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎంతలా అంటే.. పుష్ప క్రేజ్ ఏకంగా ఖండాంతరాలు దాటేసింది. విదేశీ క్రికెటర్లు సైతం తగ్గేదేలే అంటూ బన్నీ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగ్స్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడి కూడా మాములుగా లేదు. తాజాగా ఓ పదో తరగతి కుర్రాడు చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి ఆన్సర్ పేపర్‌లో ఏకంగా పుష్ప డైలాగ్‌ను రాసేశాడు. సమాధానాలకు బదులుగా పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్‌ను పోలుస్తూ.. ‘పుష్ప, పుష్ప రాజ్.. పరీక్ష రాసేదేలే’ అంటూ రాసేశాడు. ఇది చూసిన టీచర్ ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొందరు పుష్ప మేనియాకు ఇది నిదర్శనమని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం పరీక్షా పత్రంలో ఇలా రాయడం తప్పని వాదిస్తున్నారు. సినిమా విడుదలై నాలుగు నెలలు అవుతున్నా కూడా ‘పుష్ప రైజ్’ హంగామా ఏ మాత్రం తగ్గట్లేదు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.