PushpaPushpa Song : పుష్ప2 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. పూనకాలు తెప్పిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్..!
PushpaPushpa Song : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప2. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేసే క్రమంలో సుకుమార్ షూటింగ్ స్పీడ్ పెంచాడు. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు. ఇటీవల ఈ మూవీ నుంచి మ్యూజికల్ అప్‌డేట్ ఇస్తూ ఫస్ట్ సింగిల్ ప్రోమో పుష్ప పుష్పని విడుదల చేశారు. ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక ఫుల్ సాంగ్‌ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఆ సాంగ్ లాంచ్ కన్నా ముందు బన్నీకి సంబంధించిన లుక్స్ విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కొద్ది సేపటి క్రితమే మూవీకి సంబంధించిన తొలి సాంగ్ విడుదలైంది. ఇది మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. బన్నీ లుక్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాంచి కిక్ ఇచ్చింది. ఇక ఫస్ట్ సాంగ్‌తోనే అభిమానులలో జోష్ రాగా, రానున్న రోజులలో ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్ అయిన కిక్కివ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తొలి పాటని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతోపాటు బెంగాళీ భాషల్లో విడుదల చేసారు. ఇక సీక్వెల్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
PushpaPushpa Song : పుష్ప2 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. పూనకాలు తెప్పిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్..!
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు. పుష్ప ది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ భూషణ్ కుమార్ టీ సిరీస్ దక్కించుకుంది. పుష్ప 2 పాన్ ఇండియా డెఫినిషన్ మార్చేయాలని డిసైడ్ అయ్యింది. బెంగాలీ భాషలోనూ పుష్ప 2 రిలీజ్ కానుంది. తద్వారా బెంగాలీలో విడుదలవుతోన్న తొలి పాన్ ఇండియా సినిమాగా పుష్ప 2 రికార్డుల్లోకెక్కింది. ఇక రానున్న రోజులలో బన్నీ మూవీ మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్‌లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
This website uses cookies.