Prabhas : ప్రభాస్‌తో ఫ్రెండ్షిప్పా.. పీవీ సింధు బాగోతం బాగానే ఉందిగా..!
Prabhas : మన తెలుగు తేజం పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, తన శరీరాకృతిని కాపాడుకోవడమే పీవీ సింధు విజయానికి కారణాలు. 27 ఏళ్ల ఈ యువతి చిన్నప్పటి నుంచి పలు క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తోంది. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, తన శరీరాకృతిని కాపాడుకోవడమే పీవీ సింధు విజయానికి కారణాలు.కామన్వెల్త్ గేమ్స్ 2022లో పీవీ సింధు గోల్డ్ సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీని ఫైనల్లో వరుస గేమ్‌లలో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
Prabhas : స్టన్నింగ్ సమాధానాలు..
తాజాగా పీవీ సింధు ఊహించని విధంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో ప్రత్యక్షమై షాక్ ఇచ్చింది. ఆలీ పలు ఆసక్తికర విషయాలు అడడగా వాటికి ఊహించని సమాధానాలే ఇచ్చింది. ‘మెడల్ తీసుకున్నప్పుడు మన చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది?’ అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ”అక్కడ విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ హైగా వినిపించినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది” అని సింధు తెలిపింది.
లవ్ లెటర్స్ గురించిన అడగ్గా.. ”ఇప్పటివరకు నాకు ఎన్నో ప్రేమలేఖలు వచ్చాయి. ఆ లెటర్స్ అన్నింటిని మా ఇంట్లో వాళ్లందరం కలిసే చదివేవాళ్లం. ఓ 70 ఏళ్ల వ్యక్తి అయితే, ఇలాగే లేఖ రాశాడు. అతనికిచ్చి పెళ్లి చేయకపోతే నన్ను కిడ్నాప్ చేస్తానని అందులో రాశాడు” అని పేర్కొంది. ‘తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం’ అని అడగ్గా ”చాలా మంది ఉన్నారు. ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మేము మంచి ఫ్రెండ్స్ కూడా” అని సింధు చెప్పడంతో ‘ఎందుకు సేమ్ హైట్ కాబట్టా?’ అని ఆలీ నవ్వులు తెప్పించాడు. ‘భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా?’ అన్న అప్రశ్నకు ‘ఏమో.. నా బయోపిక్ కూడా ఉండొచ్చేమో!’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది పీవీ సింధు