సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!

Advertisement

Thammareddy bharadwaja : సౌందర్య, సాయి కుమార్ జంటగా నటించిన సినిమా అంతఃపురం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు అవార్డులు దక్కించుకుంది. గెస్ట్ రోల్ లో జగపతిబాబు, కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమా అందరికి మైల్ స్టొన్ మూవీలా నిలిచింది. ప్రతీ ఒక్కరికి ఇందులోని పాత్ర ద్వారా జీవితాంతం గుర్తుండిపోయే పాపులారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాకి పి.కిరణ్ నిర్మాతగా, తమ్మారెడ్డి భరద్వాజ సహా నిర్మాతగా వ్యవహరించారు. ఇదే సినిమా బాలీవుడ్ లో కూడా రూపొందించారు. ఇక్కడ జగపతిబాబు పోషించిన పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ పోషించారు.

thammareddy bharadwaja About on soundarya And sai kumar
thammareddy bharadwaja About on soundarya And sai kumar

అప్పటి వరకు వచ్చిన సినిమాలకంటే ఎంతో భిన్నంగా రూపొందిన అంతఃపురం 1998లో రిలీజైంది. ప్రత్యేకంగా కృష్ణవంశీ మేకింగ్ గురించి చాలా మాట్లాడుకున్నారు. అంతేకాదు ఏకంగా 8 నంది అవార్డులను సొంతం చేసుకొని అప్పట్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఇక సినిమా షూటింగ్ లో భాగంగా ఓ చేదు అనుభవం ఎదురైనట్లు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈస్ట్ ఆఫ్రికా మారుషూయస్ లో షూటింగ్ కు వెళ్లినప్పుడు, అక్కడ బస చేసిన హోటల్ లో ఒక్కసారిగా దొంగలు చొరబడి నానా బీభత్సం సృష్టించినట్టు వెల్లడించారు.

Advertisement

Thammareddy bharadwaja : నా దగ్గర ఒక్క డాలర్ కూడా లేదు.

thammareddy bharadwaja About on soundarya And sai kumar
thammareddy bharadwaja About on soundarya And sai kumar

వాళ్ళ వద్దనున్న డబ్బు మొత్తం తీసుకొని వెళ్లిపోయారట. హోటల్ గదులకు తాళాలు వేసి అందరూ షూటింగ్ కు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఎలా చొరబడ్డారో తెలియదు గాని, దొంగలు బ్యాగులో ఉన్న డబ్బంతా దోచుకెళ్లారు. సౌందర్య, సాయి కుమార్ ముందు డబ్బులు ఏమి లేవన్నారు. కానీ వాళ్ళ బ్యాగ్ లలో లక్ష రూపాయలు ఉన్నాయి. దొంగలు వాటిని ఎత్తుకొని వెళ్ళాక ఆ విషయాన్ని మాతో చెప్పారు. అంటూ భరద్వాజ వెల్లడించారు. షూటింగ్ చివరికి వచ్చేసరికి మా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. ప్రొడక్షన్ హౌజ్ డబ్బు ఓ 5 డాలర్లు ఉంటే, అవి అందరికి సమానంగా ఇచ్చాను. నా దగ్గర ఒక్క డాలర్ కూడా లేదు. బాగా ఆకలి వేసింది. అయినా ఎవరిని అడగలేని పరిస్థితి. ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న శ్రీవాస్ తనదగ్గర ఉన్న 5 డాలర్లతో ఆకలి తీర్చుకున్నాను.. అని తమ్మారెడ్డి అంతఃపురం సినిమా సమయంలో జరిగిన సంఘటనను చెప్పుకొచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> టాటూ ఫేక్ కానీ ప్రపోజల్ నిజమే.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ రెడ్డి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైప‌ర్‌ ఆది, సుధీర్ లు కావ‌చ్చు…!

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు

ఇది కూడా చ‌ద‌వండి ==> పైన పటారం లోన లొటారం !.. అవినాష్ పరువుతీసేసిన శ్రీముఖి

Advertisement
Advertisement