Radhe Shyam : రాధే శ్యామ్ అప్పుడే ఓటీటీలోనా.. ప్రభాస్ పరిస్థితి ఏంది ఇలా అయింది?
Radhe Shyam : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌కి సాహో, రాధే శ్యామ్ చిత్రాలు ఘోర పరాభవాన్ని చూపించాయి. సాహో అయితే కలెక్షన్స్ పరంగా కాస్త బెటర్ అనిపించినా కూడా రాధే శ్యామ్ మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేకపోతుంది. నాలుగో రోజు ఈ మూవీ రెండు కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది అంటే సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అద్భుతమైన ఓపినింగ్స్ తో మొదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తో కష్టమనిపించుకుంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించగా, పూజా డాక్టర్ ప్రేరణ పాత్ర పోషించింది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన
ఈ ప్రేమకథ చిత్రం రీసెంట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు మీడియా వర్గాల సమచారం.ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు చాలామందే ఉన్నారు. సాధారణంగా థియేటర్లకు వచ్చిన ఒక నెల తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి సినిమాలు అడుగుపెడుతుంటాయి. అలా చూసుకుంటే ఏప్రిల్ 11 తరువాత ఈ సినిమా ఓటీటీకి రావలసి ఉంటుంది. కానీ ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీనే ఓటీటీ ద్వారా వదలాలనే ఆలోచనలో అమెజాన్ ప్రైమ్ వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను వారే సొంతం చేసుకున్నారు.’ఉగాది’ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో వారు చర్చలు జరుపుతున్నారట.
Radhe Shyam : అప్పుడే ఓటీటీనా అంటూ నోరెళ్లపెడుతున్న ఫ్యాన్స్
ఆ చర్చలు ఫలిస్తే మాత్రమే ఈ సినిమా ఏప్రిల్ 2న రావడం ఖాయమేనని అంటున్నారు. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ లవ్‌స్టోరీ ని డివైడ్ టాక్ తో చాలా మంది థియోటర్స్ కు వెళ్లడంలేదు. పూర్తి ప్రేమకథ అని భావించిన వారిని ఈ మూవీ ఆకట్టుకోగా.. మరికొందరిని మాత్రం నిరాశ పరిచింది. దీనికి కారణంగా రాధేశ్యామ్‌లో ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా లేకపోవడమే. అంతేకాదు పాన్ ఇండియా చిత్రం, రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ మూవీ, పైగా ప్రభాస్ సినిమా.. అందులో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ లేదు, ఓ కామెడీ లేదంటూ మాస్ ఆడియన్స్ అంటున్నారు.