Hyper Aadi : జబర్దస్త్… వెళ్తూ వెళ్తూ రైజింగ్ రాజుకు అన్యాయం చేసి వెళ్లిన హైపర్ ఆది
Hyper Aadi : జబర్దస్త్ ప్రారంభం అయిన సమయంలో వచ్చిన టీమ్స్ లో కేవలం రాకెట్ రాఘవ టీమ్ మాత్రమే కొనసాగుతుంది. ఆ ఒక్క టీమ్ తప్ప మిగిలిన అన్ని టీమ్స్ కూడా కొత్తగా వచ్చినవే.. కొత్త టీమ్ లీడర్స్ గా వచ్చిన వారే. ఆరంభంలో రైజింగ్ రాజు జబర్దస్త్ లో సందడి చేశాడు. ఆయన్ను మరియు అదిరే అభి టీమ్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న ఆదిని కలిపి హైపర్ ఆది రైజింగ్ రాజు అనే టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. టీమ్ లీడర్స్ ఇద్దరు అయినా కూడా ఆది మొత్తం బాధ్యత తీసుకుని టీమ్ ను నడిపించిన విషయం తెల్సిందే. రాజు విషయం పెద్దగా ఏమీ లేకున్నా కూడా
హైపర్ ఆది తన యొక్క మంచి తనంతో రైజింగ్ రాజును కూడ ఒక టీమ్ లీడర్ గా గుర్తించడంతో పాటు పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది. ఆ మధ్య హైపర్ ఆది జబర్దస్త్ కు దూరం గా ఉండటంతో రైజింగ్ రాజు సొంతంగా టీమ్ ను లీడ్ చేసుకున్నాడు. ఆది రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ గా మారింది. కానీ ఆది రీ ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే దూరం అయ్యాడు. ఈసారి పర్మినెంట్ గా ఆది జబర్దస్త్ కు దూరం అయ్యాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఆది వెళ్లి పోవడంతో ఈసారి
రైజింగ్ రాజు టీమ్ కి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అసలు రైజింగ్ రాజు అనేవాడు లేకుండా పోయాడు. ఎక్కడో ఒక మూల చిన్న చిన్న గెటప్స్ తో పాత్రలతో కనిపిస్తున్నాడు. ముందు ముందు రైజింగ్ రాజు అసలు జబర్దస్త్ స్టేజ్ పై కనిపించడం అసాధ్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న హైపర్ ఆది స్కిట్స్ లో గతంలో రైజింగ్ రాజుకు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైజింగ్ రాజు కనీసం సినిమాల్లో నటిస్తున్నాడా అంటే అది కూడా లేదు. ఆయన వయసు రీత్యా ఆయన్ను చాలా మంది పక్కన పెడుతున్నారు.